Begin typing your search above and press return to search.

విశాఖలో మోడీతో : గిన్నీస్ రికార్డ్ ని బద్ధలు కొట్టేలా !

మే 21 నుంచి జూన్ 21 మధ్య నెల రోజుల పాటు యోగా మంత్ గా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

By:  Tupaki Desk   |   17 May 2025 4:00 AM IST
విశాఖలో మోడీతో : గిన్నీస్ రికార్డ్ ని బద్ధలు కొట్టేలా !
X

విశాఖ ఒక భారీ రికార్డుని క్రియేట్ చేయబోతోంది. అంతే కాదు ఒక పెద్ద రికార్డుని బద్ధలు కొట్టబోతోంది. దాని కోసం ఇప్పటి నుంచే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖలో పెద్ద ఎత్తున కసరత్తు సాగుతోంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్నది అందరికీ తెలిసిందే

ఈ నెల 2న అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని ఏపీలో యోగా దినోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అదే వేదిక మీద కోరారు. దానికి మోడీ అదే వేదిక నుంచి అంగీకారం తెలిపారు. దాంతో విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

ప్రధాని పాల్గొనే ఈ యోగా డేలో ఏకంగా లక్షలాది మందిని భాగస్వాములను చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మే 21 నుంచి జూన్ 21 మధ్య నెల రోజుల పాటు యోగా మంత్ గా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం వార్డులలో యోగా కార్యక్రమాల నిర్వహించాలని చూస్తోంది. అలా నెలరోజుల పాటు యోగా ప్రాక్టీస్ చేసిన వారికి సర్టిఫికెట్ లను ప్రదానం చేస్తారు. ఇక ప్రధాని పాల్గొనే యోగా కార్యక్రమంలో లక్షలాది మంది ఔత్సాహిక యోగా కార్యకర్తలను పాల్గొనేలా చూస్తారు.

ఇక లక్షలాది మందితో యోగాసనాలు విశాఖ ఆర్కే బీచ్ మొత్తం చేస్తారు అని అంటున్నారు. ఏకంగా భీమిలీ బీచ్ దాకా ఆ రోజు తీర ప్రాంతం అంతటా యోగా సాగుతూనే ఉంటుంది. ఈ విధంగా సముద్రం తీరం పొడవునా యోగాసనాలను ఆ రోజు వేస్తారు. ఇక చూస్తే విశాఖలో జరిగే యోగా డేతో గత పదేళ్ళ పాత రికార్డులు అన్నీ తుడిచిపెట్టాలని కూటమి పెద్దలు చూస్తున్నారు.

చూస్తే కనుక విశాఖలో జరిగే యోగా డేలో మొత్తం రెండున్నర లక్షల మంది దాకా పాల్గొంటారు అని అంటున్నారు. అలా అంతమంది పాల్గొనేలా ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. దేశంలో యోగా డే లక్షలాది మందితో జరిగింది అత్యధిక మందితో చేసి గిన్నీస్ రికర్డు అందుకున్నది గుజరాత్ లోని సూరత్ లో అని చెబుతున్నారు. సూరత్ లో 2023లో జూన్ 21న జరిగిన యోగా డే లో ఒకే చోట ఒక లక్షా 53 వేల మంది యోగా డేలో పాల్గొన్నారు. అదే ఈ రోజుకీ అతి పెద్ద రికార్డుగా అంతర్జాతీయంగా ఉంది.

ఇపుడు ఆ రికార్డుని బద్ధలు కొట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఏకంగా రెండున్నర లక్షల మందితో యోగా అంటే కచ్చితంగా ఇది చాలా కాలం ఎవరూ బద్ధలు కొట్టలేని రికార్డుగా ఉండబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విశాఖలో యగా డేని సమీక్షిస్తున్నారు ఇప్పటి నుంచే ఘనంగా ఏర్పాట్లు ఉండాలని ఆయన అధికారులను ఆదేశిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే యోగా దినోత్సవం అదిరిపోయే రేంజి లో ఉండాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు.

ఇక నెల రోజుల పాటు యోగా ప్రాక్టీస్ జరగాలని అలాగే గ్రామ స్థాయి నుంచి జిల్లా వారకూ మొత్తం ఏపీలో జనంలో అత్యధిక భాగం ఆ రోజున అన్ని చోట్లా యోగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా విశాఖలో జూన్ 21న జరిగే యోగా డే ప్రపంచ రికార్డుని బద్ధలు కొడుతుంది అని అంటున్నారు. ఆ రోజున ప్రపంచం మొత్తం చూపు విశాఖ మీదనే ఉంటుంది అని చెబుతున్నారు.