విశాఖలో నిర్మించనున్న యూనిటీ మాల్ స్పెషాలిటీ ఏమిటి?
ఈ మాల్ ను విశాఖపట్నంలోని మధురవాడలో నిర్మిస్తారు. ఇందుకోసం రూ.174 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు.
By: Tupaki Desk | 1 May 2025 4:01 AMవిశాఖపట్నానికి ఆభరణంగా మారనుంది యూనిటీ మాల్. కేంద్రం మంజూరు చేసిన ఈ యూనిట్ స్పెషాలిటీ ఏమిటి? ఇంతకూ యూనిటీ మాల్ అంటే ఏంటి? అందులో ఏముంటుంది? ఇంతకూ ఒక మాల్ ను కేంద్రం మంజూరు చేయటం ఏమిటి? లాంటి బోలెడన్ని సందేహాలు రావొచ్చు. ఇంతకూ ఈ యూనిట్ మాల్ ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. దేశ వ్యాప్తంగా ఉండే చేనేత.. హస్తకళల్ని ప్రోత్సహించటమే ఈ మాల్ ప్రత్యేకత.
ఈ మాల్ ను విశాఖపట్నంలోని మధురవాడలో నిర్మిస్తారు. ఇందుకోసం రూ.174 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. దీన్ని జీప్లస్4లో నిర్మిస్తారు. ఈ యూనిట్ మాల్ నిర్మాణానికి అయ్యే ఖర్చులో మొదటి విడతగా రూ.86కోట్ల మొత్తాన్ని మంజూరు చేశారు. ఈ యూనిటీ మాల్ ను వర్చువల్ గా రేపు (మే 2) వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఈ మాల్ ను వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని.. అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంగా పని చే్తున్నారు.
ఈ మాల్ నిర్మాణానికి అవసరమైన మొత్తాన్ని ఇస్తున్న కేంద్రం.. దానిని వడ్డీ లేని రుణాన్ని ఏపీ ప్రభుత్వానికి ఇవ్వనుంది. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ యూనిట్ కు రాష్ట్ర సర్కారు ఓకే చెప్పింది. రుషికొండ బీచ్ కు 5 కి.మీ. దూరంలో ఉండే కొండ ఏటవాలు ప్రాంతంలో సముద్రాన్ని అనుకొని ఈ నిర్మాణం రానుంది. మూడో అంతస్తు నుంచి సీ వ్యూ దీనికి ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని చెబుతున్నారు. ఈ మాల్ లోని షాపుల్లో ఏపీలోని జిల్లాల వారీగా 26 షాపుల్ని కేటాయిస్తారు. ఒక్కో షాపు విస్తీర్ణం 600 అడుగుల నుంచి వెయ్యి అడుగుల మధ్యన ఉంటాయని చెబుతున్నారు.
ఈ మాల్ లో మొత్తం 62 షాపుల్ని ఏర్పాటు చేస్తారు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్పత్తుల అమ్మకాలకు వీటిని కేటాయిస్తారు. ఈ మాల్ నాలుగో అంస్తులో కన్వెన్షన్ హాట్.. రెండు మినీ థియేటర్లు ఉంటాయనిచెబుతున్నారు. ఇవే కాక.. రిటైల్ స్టోర్లు.. ఫుడ్ అండ్ బెవరేజ్ ఔట్ లెట్లు.. ఫిట్ నెస్ సెంటర్లు.. బ్యాంకు శాఖలు.. ఫర్నిచరర్ స్టోర్లు కూడా ఉండేలా ప్లాన్ చేశారు.