కొత్త మేయర్ పీలా గురించి తెలిస్తే అవాక్కు అవుతారు !
ఆయనకే ఈ పదవి ఇస్తున్నారు అన్నది నూరు శాతం నిజమని అంటున్నారు. ఇక ఈ పదవికి పీలా తప్ప మరో పేరు కూడా కూటమిలో వినిపించడం లేదు.
By: Tupaki Desk | 19 April 2025 11:00 PM ISTవిశాఖకు కొత్త మేయర్ గా తెలుగుదేశం పార్టీ 72వ వార్డు కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు పేరు కంఫర్మ్ అయింది. ఆయనకే ఈ పదవి ఇస్తున్నారు అన్నది నూరు శాతం నిజమని అంటున్నారు. ఇక ఈ పదవికి పీలా తప్ప మరో పేరు కూడా కూటమిలో వినిపించడం లేదు.
ఇంతకీ పీలా స్పెషాలిటీ ఏమిటి ఎందుకు ఆయనకే ఈ పదవి ఇవ్వాలని ప్రశ్న వేసుకుంటే ఎన్నో జవాబులు వస్తాయి. ఆయన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు. ఆయన పార్టీకి విధేయుడు అయిన నాయకుడు. అంకిత భావంతో పార్టీ కోసం పనిచేస్తారు.
అధినాయకత్వం కూడా ఆయన పట్ల ఎంతో అభిమానం చూపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన ప్రజల మనిషి అన్నదే అసలు నిజం. అందుకే ఆయన పట్ల అంతా మొగ్గు చూపిస్తున్నారు. ఆయన తన వార్డులో రోడ్లను అద్దాలుగా చేసి చూపించారు. అది కూడా కేవలం పది నెలల కాలంలోనే ఆయన ప్రతీ రోజూ ప్రజలను కలుస్తారు. వారితో మమేకం అవుతారు. వారి కష్టాలను తెలుసుకుంటారు.
తన వల్ల అయ్యే ప్రతీ సమస్యనూ ఆయన పరిష్కరిస్తారు. కాని వాటిని ప్రభుత్వం దృష్టిలో పెడతారు. ఒక వార్డు కార్పోరేటర్ గా తన వార్డులో అనేక సమస్యలను పరిష్కరించిన పీలా మేయర్ గా అయితే మొత్తం 98 వార్డులలో సమస్యలను కూడా పరిష్కరిస్తారు కదా అన్నదే అంతా అంటున్న మాట.
దాని కంటే ముందు పిలిస్తే పలికే మనిషి పీలా అని అంతా అంటారు. ఆయన ఇల్లు ఎపుడూ తిరునాళ్ళ మాదిరిగా ఉంటుంది అని అంటున్నారు. సమస్య ఏది ఉన్నా పీలా వద్దకు వెళ్తే చాలు క్లియర్ అవుతుంది అన్న నమ్మకం ఆయన కలిగించారు. మరో వైపు చూస్తే కనుక పీలా వైపే పార్టీలో అత్యధిక కార్పోరేటర్లు మొగ్గు చూపుతున్నారు
అర్ధబలం అంగబలం కలిగిన పీలా విశాఖ జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కావాల్సిన వారే. కానీ సామాజిక సమీకరణ వల్ల ఆయనకు సీటు దక్కలేదు. ఇపుడు విశాఖ మేయర్ చాన్స్ ఆయన కోసమే ఉంది అని అంటున్నారు. నాలుగేళ్ళు ఆలస్యం అయినా కోరుకున్న పదవి వరించి మరీ ఆయనకు దక్కుతోంది అంటున్నారు. పార్టీ కోసం కష్టపడితే రిజల్ట్ ఇలాగే ఉంటుందని తెలుగుదేశంలో నాయకులు అంటున్నారు.
మొత్తం మీద ఏపీలో అధికారంలో టీడీపీ ఉంది. అలాగే విశాఖలో కూడా పాలన తెలుగుదేశం చేతిలోకి వస్తే నగరం మరింతగా బాగుపడుతుందని అంటున్నారు. ఏటా అయిదారువేల కోట్ల బడ్జెట్ తో జీవీఎంసీ పాలన నడుస్తుంది ప్రభుత్వం కూడా టీడీపీదే కాబట్టి ఇంకా అవసరం అయిన నిధులను తెచ్చి మరీ పీలా లాంటి వారు విశాఖను అభివృద్ధి చేస్తారు అని అంతా అంటున్నారు. మొత్తానికి పీలా అంటే అంగబలం అర్ధబలం కాదని ప్రజల బలం అని అంతా అర్ధం చేసుకోవాలని అంటున్నారు.
