Begin typing your search above and press return to search.

వైసీపీ మేయర్ ని దించేస్తారా...లెక్కలేంటి ?

విశాఖ పాలిటిక్స్ వేడెక్కుతోంది. సాధారణంగా కూల్ గా ఉండే సిటీలో రాజకీయం ఇపుడు రంజుగా మారుతోంది.

By:  Tupaki Desk   |   7 April 2025 8:49 AM IST
Visakhapatnam Politics Heat Up No-Confidence Motion In Mayor
X

విశాఖ పాలిటిక్స్ వేడెక్కుతోంది. సాధారణంగా కూల్ గా ఉండే సిటీలో రాజకీయం ఇపుడు రంజుగా మారుతోంది. దానికి కారణం మహానగరాన్ని ఏలేది ఎవరు అన్న అతి పెద్ద చర్చకు తెర తీయడమే. ఇప్పట్లో చూస్తే ఎన్నికలు లేవు. అయినా ఈ హడావుడి ఏంటి అంటే విశాఖ వైసీపీ మేయర్ ని దించేయడానికి టీడీపీ కూటమి నేతలు గత నేల మూడవ వారంలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.

దాని మీద ఒక డేట్ ఫిక్స్ చేశారు అధికారులు. ఈ నెల 19న జీవీఎంసీ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అజెండా ఒక్కటే ఉంటుంది. అది సింగిల్ లైన్. మేయర్ మీద విశ్వాసమా అవిశ్వాసమా అన్నదే ఆ అజెండా.

వైసీపీ మేయర్ మీద విశ్వాసం ప్రకటిస్తుంది దాంతో వారు ఓటు ఈ అవిశ్వాసానికి వ్యతిరేకంగా పడతాయి. ఇక కూటమి కార్పోరేటర్లు అంతా అనుకూలంగా ఓటు చేస్తారు. అలా చూస్తే కనుక అవిశ్వాసానికి ఎక్కువ ఓట్లు వస్తే మేయర్ దిగిపోవడం ఖాయం.

అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఉంది. మొత్తం జీవీఎంసీ నంబర్ లో మూడింట రెండు వంతుల మంది మేయర్ మీద అవిశ్వాసం ప్రకటించాలి అపుడే ఆమె ఓటమి పాలు అవుతారు. అంటే జీవీఎంసీలో ప్రస్తుతం 97 మంది కార్పోరేటర్లు ఉన్నారు. అలాగే 14 మంది ఎక్స్ అఫీషియో మెంబర్లు ఉన్నారు. ఇలా లెక్క చూస్తే కనుక 111 మంది అవుతారు. ఈ నంబర్ లో మూడింట రెండు వంతుల మంది అంటే 78 మంది అవుతారు.

ఇది మ్యాజిక్ ఫిగర్ అన్న మాట. మేయర్ ని దించే ఫిగర్. ఇక వైసీపీ వైపు 38 మంది కనుక ఉంటే ఒక్క ఓటు తేడాతో అవిశ్వాసం వీగిపోతుంది. అయితే వైసీపీకి ఎంతమంది ఉన్నారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. నిజానికి 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ సొంతంగా 58 మంది కార్పోరేటర్లను గెలిపించుకుంది.

కానీ కూటమి అధికారంలోకి రావడంతోనే అందులో చాలా మంది జారిపోయారు. అలా చూస్తే కనుక 45 దాకా బలం ఉండేది. ఇక ఇటీవల కాలంలో మరికొంతమంది కూటమి వైపు వెళ్ళి కండువా కప్పుకున్నారు. దాంతో వైసీపీకి నిఖార్సుగా ఎంతమంది కార్పోరేటర్ల మద్దతు ఉంది అన్నది తెలియడంలేదు.

అయితే బెంగళూరులో ప్రత్యేక క్యాంప్ పెట్టి మరీ వైసీపీ తమ మేయర్ ని కాపాడుకోవాలని చూస్తోంది. వారిని ఈ నెల 19 నాటికే విశాఖ తీసుకుని రావాలని చూస్తోంది. మరో వైపు చూస్తే మొత్తం కూటమి కార్పోరేటర్లు కానీ ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానీ కట్టకట్టుకుని ఓట్లు వేయాల్సి ఉంటుంది. జీవీఎంసీలో వామపక్షాలకు ఇద్దరు కార్పోరేటర్లు ఉన్నారు. వారు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ నంబర్ ని కూడా గమనంలోకి తీసుకోవాలని అంటున్నారు.

అలాగే బలమైన ఒక సామాజిక వర్గానికి చెందిన మేయర్ ని దించేస్తున్నారు అని ఆ సామాజిక వర్గం వారి బాధగా ఉంది. వారి ఒత్తిడి కూడా పనిచేస్తుందా అన్న చర్చ సాగుతోంది. ఇక డిప్యూటీ మేయర్ విషయంలో హామీలు కోరుతున్న వారు ఉన్నారు. ఇలా చూస్తే కూటమిలో కొంత భిన్న స్వరం ఉందని వైసీపీ అంటోంది. విశాఖ మేయర్ ని గెలిపించుకుంటామని ఆ బలం తమకు ఉందని విశాఖ సిటీ ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాధ్ అంటున్నారు

బలం లేకుండా మేయర్ మీద అవిశ్వాసం పెట్టడమేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే కూటమికి కచ్చితమైన నంబర్ ఉందని వైసీపీ నుంచి తమకు పడే ఓట్లే ఎక్కువగా ఉంటాయని కూటమి నేతలు చెబుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారం చూస్తే కనుక ఎవరి నంబర్ ఏమిటో ఈ రోజుకు అయితే తెలియదు కానీ 19 తేదీ మీద టెన్షన్ పెంచేస్తోంది. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి విశాఖ మేయర్ గా ఎవరు ఉంటారు ఏమిటి అన్నది వేచి చూడాల్సిందే.