Begin typing your search above and press return to search.

కొన్ని విష‌యాలు.. మాట్లాక‌పోతేనే బెట‌ర్ ప‌వ‌న్ స‌ర్‌!

ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీక‌రణ కాకుండా తానే ఆపాన‌ని, 11830 కోట్ల రూపాయ‌ల‌ను ఇప్పించాన‌ని చెప్పా రు.

By:  Tupaki Desk   |   31 Aug 2025 2:00 PM IST
కొన్ని విష‌యాలు.. మాట్లాక‌పోతేనే బెట‌ర్ ప‌వ‌న్ స‌ర్‌!
X

రాజ‌కీయాల్లో ఉన్న వారికి కొన్ని కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి. వీటిని ఎవ‌రూ కాద‌న‌లేరు. మ‌రీ ముఖ్యంగా కేం ద్రంలో మోడీ స‌ర్కారు ఏర్పడిన త‌ర్వాత‌.. అధికారం దాదాపు కేంద్రీకృత‌మైంది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వాల కు దాదాపు స్వేచ్ఛ పోయింది. అప్పులు ఇవ్వాల‌న్నా.. ఆర్థిక సాయం చేయాల‌న్నా కూడా.. కేంద్రం దూకు డు ఎక్కువ‌గానే ఉంది. దీనిని కొంద‌రు నిలువ‌రిస్తున్నారు.. మ‌రికొంద‌రు స‌ర్దుకు పోతున్నారు. ఈ క్ర‌మం లోనే కేంద్రం గురించి.. కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాల గురించి.. సీఎంలు స‌హా ప్ర‌భుత్వంలో ఉన్న‌వారు మాట్లాడ‌కుండా మౌనంగానే ఉంటున్నారు.

ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీక‌రణ కాకుండా తానే ఆపాన‌ని, 11830 కోట్ల రూపాయ‌ల‌ను ఇప్పించాన‌ని చెప్పా రు. వైసీపీ హ‌యాంలో ఈ విష‌యంపై ఎందుకు స్పందించ‌లేద‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. స‌రే.. వైసీ పీ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన‌ట్టుగానే విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణ నిలిచిపో యి ఉంటే.. ఆ మాట‌ను ఆయ‌న చెప్ప‌డం క‌న్నా.. కూడా కేంద్రంతో చెప్పిస్తే.. కార్మికులు హ‌ర్షిస్తారు. త‌ట‌స్థులు కూడా న‌మ్ముతారు.

ఎందుకంటే..

+ విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీకి సంబంధించి తాజాగా 34 కీలక విభాగాల‌ను ప్రైవేటు ప‌రం చేసేందుకు నోటిఫికేష న్ జారీ చేశారు. దీనిని ప‌వ‌న్ ప్ర‌స్తావించ‌లేదు. ఇది నిజం కాక‌పోతే.. దీనిపై స్పందించి ఉండాల్సింది. కానీ.. ఇది నిజం. ప‌వ‌న్ విశాఖ‌లో ఉన్న స‌మ‌యంలోనే విశాఖ యాజ‌మాన్యం ప‌త్రికా ప్ర‌క‌ట‌న కూడా జారీ చేసింది. దీనిని కాద‌ని ఎలా చెప్ప‌గ‌ల‌రు. ఒక‌వేళ ప‌వ‌న్ క‌నుక ప్రైవేటీక‌ర‌ణ ఆపేసి ఉంటే.. ఈ భాగాలు ఎందుకు ప్రైవేటుకు ఇస్తున్నారో చెప్పి ఉండాలి. లేదా కేంద్రాన్ని అడిగి ఉండాలి.

+ మ‌రీ ముఖ్యంగా కేంద్రం నుంచి తాను 11 వేల కోట్ల రూపాయ‌ల‌ను తీసుకువ‌చ్చాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబు తున్నారు. మ‌రి ఈ సొమ్మును ఎవ‌రికిఖ‌ర్చు చేశారు? దీనికి సంబంధించిన లెక్క‌లు చెప్పాలి. ప‌వ‌న్ చెబుతున్న‌ట్టు ప్రైవేటీక‌ర‌ణ ఆపి ఉండ‌క‌పోతే.. ఈ సొమ్మును క‌ర్మాగారం బ‌లోపేతానికి ఖ‌ర్చు చేసి ఉండాలి. కానీ అలా చేయ‌లేదు. ఈ సొమ్మును మూడు భాగాలుగా విడ‌దీసి.. ఖ‌ర్చు చేశారు.

1) కంపెనీ కేంద్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ కోసం రూ.520 కోట్లు ఖ‌ర్చు చేశారు.(దీని వ‌ల్ల క‌ర్మాగారం బ‌లోపేతం అయిన‌ట్టా?).

2) విశాఖ ఉక్కులో ప‌నిచేస్తున్న ప‌ర్మినెంట్ ఉద్యోగులు వాలంట‌రీ రిటైర్మెంట్ తీసుకునేలా ప్రోత్స‌హించారు. వీరికి భ‌త్యాలు, బెనిఫిట్స్ చెల్లించేందుకు.. 370 కోట్లు కేటాయించారు.(మ‌రి ఉద్యోగుల‌ను తీసేసి.. క‌ర్మాగారాన్ని బ‌లోపేతం చేస్తున్నార‌ని ప‌వ‌న్ చెప్ప‌గ‌ల‌రా?)

3) ప్రైవేటీక‌ర‌ణ‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు, ప‌త్రిక‌లకు చెల్లించాల్సిన సొమ్మును ఇచ్చేందుకు మ‌రో 200 కోట్లు కేటాయించారు. (మ‌రి ఇది విశాఖ ఉక్కును నిల‌బెట్ట‌డానికే చేసిన ప‌నా? అనేది ప‌వ‌న్ చెప్పాలి.) ఎలా చూసుకున్నా.. ఇది ఆగేది కాదు. అయితే.. కూట‌మి నాయ‌కులు మూకుమ్మ‌డిగా క‌లిసి వెళ్లి కేంద్రం ద‌గ్గ‌ర కూర్చుని బెదిరిస్తేనో.. బ్ర‌తిమాలితేనో త‌ప్ప‌. ఇది ఆగ‌దు. కాబ‌ట్టి.. ఈ విష‌యంపై ప‌వ‌న్ మౌనంగా ఉంటే.. ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు రాకుండా ఉంటాయి. ఎంత అనుకూల మీడియాలో అయినా.. ఈ విష‌యాన్ని దాచిపెట్ట‌లేరు క‌దా!?.