Begin typing your search above and press return to search.

విరాట్ కొహ్లీపై విష ప్రచారం... వీళ్లు మారరా?

ఇటీవల కాలంలో డీప్ ఫేక్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Feb 2024 1:30 PM GMT
విరాట్  కొహ్లీపై విష ప్రచారం... వీళ్లు మారరా?
X

ఇటీవల కాలంలో డీప్ ఫేక్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడంలో అత్యుత్సాహం చూపించే కొంతమంది నకిలీ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు, డీప్ ఫేక్ వీడియోలూ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. దీంతో ఏది నిజమో, ఏది ఫేకో అనేది తెలియక యూజర్స్ కన్ ఫ్యూజ్ అయిపోతుంటారు! ఈ క్రమంలో తాజాగా విరాట్ కొహ్లీకి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... ఇటీవల డీప్ ఫేక్ వీడియోలు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రముఖ హీరోయిన్‌ రష్మిక మందన్న డీప్‌ ఫేక్‌ వీడియో ఒక్కసారిగా బిగ్ ఇష్యూగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో రియాక్షన్ వచ్చింది. అనంతరం ఆ డీప్ ఫేక్ వీడియో పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు కథనాలొచ్చాయి. ఇదే సమయంలో సచిన్ టెండుల్కర్ తో పాటు ఆయన కుమార్తె సారాకు సంబంధించిన డీప్ ఫేక్ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఈ సమయంలో తాజాగా ఓ బెట్టింగ్‌ యాప్‌ ను కోహ్లి ప్రమోట్‌ చేస్తున్నట్లు డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్‌ అవుతోంది! ఈ యాప్ లో తక్కువ డబ్బులు పెట్టుబడిగా పెట్టి.. భారీ మొత్తంలో ఆర్జించినట్లు కోహ్లి చెబుతున్నట్లుగా ఆ వీడియో క్రియేట్ చేయబడింది. ఇదే సమయంలో... ఆ ప్రకటన ఓ టీవీ చానెల్‌ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు సైబర్‌ మాయగాళ్లు క్రియేట్ చేశారు. దీంతో ఈ వీడియోపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తుంది.

ఈ క్రమంలో ఈ వీడియోపై స్పందించిన ఒక జర్నలిస్టు... "నిజంగానే విరాట్‌ కోహ్లి ఇలాంటివాటిని ప్రోత్సహిస్తున్నాడా.. లేక, ఇదంతా ఏఐ మాయా?.. ఒకవేళ అదే నిజమైతే వీడియో రియలిస్టిక్ గా చిత్రీకరించడంలో వారు సక్సెస్ అయ్యారు. టెక్నాలజీని మరీ ఇంత దుర్వినియోగం చేస్తారా?" అని రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో... ఇది కచ్చితంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజిన్స్‌ మాయ అని అర్థమవుతోందని స్పందిస్తున్న నెటిజన్లు ఈ విషయాలపై పోలీసులు రియాక్ట్ అవ్వాలని కోరుతున్నారు!

కాగా... స్వదేశంలో ఇంగ్లండ్‌ తో టెస్టు సిరీస్‌ కు వ్యక్తిగత కారణాలతో విరాట్‌ కోహ్లి దూరమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కుటుంబానికి సమయం కేటాయించిన కొహ్లీ సెలవు పొడగించుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి నిర్ణయాన్ని గౌరవిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. క్రమంలో విరుష్క దంపతులు రెండోసారి పేరెంట్స్ కాబోతున్న సమయంలో ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు తలెత్తాయనే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.