Begin typing your search above and press return to search.

వీడియో : కోహ్లీకి కోపం వచ్చింది

ఇప్పుడు ఏకంగా ఇండియాను వదిలి పెట్టి సుదీర్ఘ కాలం లండన్‌లో ఉండేందుకు సిద్ధం అయ్యాడు. లండన్‌లోనూ కోహ్లీని అభిమానులు వెంబడిస్తూ ఇబ్బంది పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   5 July 2025 11:38 AM IST
వీడియో : కోహ్లీకి కోపం వచ్చింది
X

టీం ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ గత కొంత కాలంగా లండన్‌లో ఉంటున్నాడు. ఇటీవల ఐపీఎల్‌ ముగించుకున్న వెంటనే లండన్‌ వెళ్లిన కోహ్లీ ప్రశాంతమైన జీవితం కోసం అక్కడ ఉంటున్నట్లు సమాచారం అందుతోంది. లండన్‌ వెళ్లినా కూడా కోహ్లీ జంటకు ప్రశాంతత లభించడం లేదు. ఇండియాలో కోహ్లీ ఎక్కడ ఉన్నా గుర్తు పట్టి ఆయనతో ఫోటోలు, వీడియోలు అంటూ వెంట పడుతూ ఉంటారు. అందుకే కోహ్లీ విశ్రాంతి కోసం వేరే దేశం వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఏకంగా ఇండియాను వదిలి పెట్టి సుదీర్ఘ కాలం లండన్‌లో ఉండేందుకు సిద్ధం అయ్యాడు. లండన్‌లోనూ కోహ్లీని అభిమానులు వెంబడిస్తూ ఇబ్బంది పెడుతున్నారు.

ఇటీవల లండన్‌ వీధుల్లో అనుష్కతో కలిసి సరదాగా తిరుగుతున్న సమయంలో ఒక అభిమాని కోహ్లీని వెంబడించాడు. చాలా సమయం కోహ్లీని వీడియో తీస్తూ ఉన్నాడు. అది గుర్తించిన కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఏంటి ఇది అన్నట్లుగా అతడి వైపు కోహ్లీ తిరిగి చూశాడు. కోహ్లీ అసహనంతో తిరిగి చూసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎంత సెలబ్రిటీ అయినా ప్రైవేట్‌ లైఫ్‌ అనేది ఉంటుంది. కనుక వారికి ఫ్రీడం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పదే పదే కోహ్లీని అలా వీడియోలు తీస్తూ ఉండటం వల్ల ఆయన ఇబ్బందిగా ఫీల్‌ అవుతున్నాడు. ఆ విషయాన్ని చాలా మంది గుర్తించడం లేదు. కోహ్లీ మాత్రమే కాకుండా చాలా మంది సెలబ్రిటీలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఎంత పాపులారిటీ ఉంటే అంతగా ఫ్రీడం కోల్పోయినట్లు అవుతుంది. అందుకే లండన్‌ వీధుల్లోనూ కోహ్లీకి ప్రశాంతత లభించడం లేదు. కోహ్లీ టీం ఇండియా స్టార్‌ క్రికెటర్‌. ఆయన ఆట అంటే ఇండియన్స్‌కి మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను ఇష్టపడే వారు ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా కూడా కోహ్లీని జనాలు గుర్తిస్తారు, క్రికెట్‌ అనేది తెలిసిన ప్రతి దేశంలోనూ కోహ్లీకి అభిమానులు ఉంటారు. అందుకే ఆయన ఫ్యామిలీతో ఎక్కడకు వెళ్లినా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాడు. తాజాగా మరోసారి ఇలా లండన్‌లో అనుష్కతో వీధుల్లో తిరుగుతున్న సమయంలో ఎవరో వ్యక్తి ఇలా వీడియో తీశాడు, అందుకు కోహ్లీ కోపంతో చూశాడు.

చిన్న వయసు నుంచి క్రికెట్‌లో ఉన్న కోహ్లీ సుదీర్ఘ కాలం పాటు ఇండియన్‌ జట్టుకు సేవను అందించాడు. సచిన్‌ సాధించిన చాలా రికార్డ్‌లు ఎవరికి సాధ్యం కావని అనుకున్నారు. కానీ కోహ్లీ ఎన్నో రికార్డ్‌లను బ్రేక్‌ చేశాడు. సచిన్‌ కంటే ముందు వరుసలో నిలిచాడు. టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పినా కూడా ఆయన ఫ్యాన్స్ ఆయన క్రికెట్‌ను ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ ట్రోఫీని సైతం కోహ్లీ దక్కించుకున్నాడు. అత్యంత అరుదుగా క్రికెటర్లు దక్కించుకునే పలు విజయాలను, టోర్నమెంట్స్ను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో మరో పదేళ్ల వరకు ఇలాంటి ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.