Begin typing your search above and press return to search.

కరాచీలో బైక్ నడుపుతూ హస్తప్రయోగం... వీడియో వైరల్!

అవును... పాకిస్థాన్‌ లోని కరాచీలో బైక్ నడుపుతూ హస్తప్రయోగం చేసుకుంటున్న ఓ బైకర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   3 Oct 2023 4:15 AM GMT
కరాచీలో బైక్  నడుపుతూ హస్తప్రయోగం... వీడియో వైరల్!
X

అమ్మాయిలను చూసి పిచ్చి పిచ్చి పనులు చేసే జనాలతో పాటు అసభ్యకరమైన పనులు చేసే జనాలు కూడా ఉంటారనేది తెలిసిన విషయమే. అత్యంత అసహ్యకరమైన పనులు చేస్తూ తమ పైత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అలాంటి పైత్యం పట్టిన ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో ఇప్పుడు పాక్ లో హాట్ టాపిక్ గా మారింది.

అవును... పాకిస్థాన్‌ లోని కరాచీలో బైక్ నడుపుతూ హస్తప్రయోగం చేసుకుంటున్న ఓ బైకర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గర్ల్ స్టూడెంట్స్ వెళ్తున్న వ్యాన్ ను వెంబడించిన ఈ బైకర్... ఆ క్రమంలో హస్త ప్రయోగం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ వక్రబుద్ధిని వెంబడిస్తున్న వ్యాన్‌ లో కూర్చున్న విద్యార్థిని ఒకరు వీడియో తీశారు.

కరాచీ యూనివర్శిటీకి చెందిన విద్యార్థినులతో నిండిన వ్యాన్‌ ను ఈ వంకర బుద్దున్న వ్యక్తి వెంబడిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ వ్యక్తి తన బైక్ పై వ్యాన్‌ ను వెంబడిస్తూ రషీద్ మిన్హాస్ రోడ్డులో బాలికల ముందు కదులుతున్న బైక్‌ పై హస్తప్రయోగం చేయడం ప్రారంభించాడు.

ఇలా పట్టపగలు, నడి రోడ్డుపై, బాలికల ముందు ఇలాంటి అసహ్యకరమైన పనికి ఒడిగట్టాడు. ఈ సంఘటన జరిగిన ప్రాంతం రద్దీగా ఉండే ప్రాంతంగా చెబుతున్నారూ. ఈ క్రమంలో ఆ వ్యాన్ లో ఉన్న వారిలో ఒక అమ్మాయి ఆ వ్యక్తి చేసిన పనిని కెమెరాలో రికార్డ్ చేయడం ప్రారంభించింది.

బాలికలు ఉన్న వ్యాన్‌ ను అనుసరిస్తూ బైకర్.. హెల్మెట్ ధరించి కనిపించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్‌ గా మారింది. ఇతడిపై చర్యలు తీసుకోవాలని క్యాంపైన్ తరహాలో షేర్స్ చేశారు. దీంతో... సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. రషీద్ మిన్హాస్ రోడ్‌ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలోని ప్రసిద్ధ షాపింగ్ సెంటర్ ఎదురుగా ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు.