Begin typing your search above and press return to search.

నిన్న కోవలం.. నేడు బెకల్... బీచ్ లో సాయిరెడ్డి సందడి పిక్స్ వైరల్!

ఇక్కడి ప్రకృతి పట్ల ప్రజలకు ఉన్న గౌరవం, ప్రేమను అర్థం చేసుకోవడానికి కేరళను తప్పక సందర్శించాలి అని పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   8 Sep 2023 8:30 AM GMT
నిన్న కోవలం.. నేడు బెకల్... బీచ్  లో సాయిరెడ్డి సందడి పిక్స్  వైరల్!
X

రాజకీయ నాయకులు విహారయాత్రలకు వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. రెండుమూడేళ్లకు ఒకసారి వెళ్లిన ఆది అదృష్టమే అని భావించేవారు కూడా లేకపోలేదు. ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి తన కుమార్తెలతో గడపడానికి లండన్ వెళ్లగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేరళ వెళ్లారు.


అవును... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భగంగా వరుసపెట్టి ప్రఖ్యాత బీచ్ లను సందర్శిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలను, తన అనుభూతులను, ఫోటోలను ఆన్ లైన్ వేదికగా పంచుకుంటున్నారు.

ఇందులో భాగంగా నిన్న కోవలం బీచ్ ను సందర్శించిన విజయసాయిరెడ్డి... ఈ రోజు బెకల్ బీచ్‌ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన స్పందనను ఎక్స్ (ట్విట్టర్) లో పంచుకున్నారు. ఉదయం పూట బీచ్ లో నడక గొప్ప అనుభూతిని అందిస్తుందని ఈ సందర్భంగా సాయిరెడ్డి తెలిపారు.


ఈ క్రమంలో తాజాగా బెకల్ బీచ్ ని సందర్శించిన సందర్భంగా సాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ఇందులో భాగంగా... కేరళలో అందమైన బీచ్‌ లు ఉన్నాయి. ఇక్కడ నుంచి అరేబియా సముద్రం అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడి ప్రకృతి పట్ల ప్రజలకు ఉన్న గౌరవం, ప్రేమను అర్థం చేసుకోవడానికి కేరళను తప్పక సందర్శించాలి అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... ఈ రోజు ఉదయం బెకల్ బీచ్‌ లో ఉండే అద్భుతమైన అవకాశం లభించిందని తెలిపిన ఆయన.. తాను ఈ బీచ్‌ లో సముద్రంలో కలిసే నదిని చూడగలిగినట్లు తెలిపారు. ఇది ఒక అందమైన ప్రదేశంలో ఒక మధురమైన జ్ఞాపకం అంటూ సాయిరెడ్డి తన అనుభూతిని ఆన్ లైన్ వేదికగా పంచుకున్నారు.

కాగా... నిన్న కోవలం బీచ్ లో వాకింగ్ చేసినప్పటి ఫోటోలు షేర్ చేసిన ఆయన... ఇక్కడ ఎప్పుడూ చూడని అంశాలు చూశానని, చేపలు పట్టే క్రమంలో సముద్రంలోకి వెళ్లేటప్పుడు మత్స్యకారులు ఎదుర్కొనే సమస్యలు గమనించానని విజయసాయిరెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎగసిపడుతున్న అలలకు ఎదురొడ్డి సముద్రంలోకి ప్రవేశించడం మత్స్యకారులకు ఎదురయ్యే సమస్యల్లో కఠినమైనదని వివరించారు.