Begin typing your search above and press return to search.

అమ్మాయిలు అబ్బాయిల మధ్య కారు రేసింగ్.. ప్రాణాపాయంలో సామాన్యులు!

పలువురికి గాయాలు కాగా.. ఇద్దరి ప్రాణాలకు మాత్రం డేంజర్ ఉందన్న మాటను వైద్యులు చెబుతున్నారు

By:  Tupaki Desk   |   20 Nov 2023 4:23 AM GMT
అమ్మాయిలు అబ్బాయిల మధ్య కారు రేసింగ్.. ప్రాణాపాయంలో సామాన్యులు!
X

ధన మదం కావొచ్చు.. సంపదతో మునిగి తేలుతున్న యువతీయువకులు అత్యంత విలాసమైన.. ఖరీదైన కార్లను రోడ్ల మీదకు తీసుకొచ్చి.. రోడ్ల మీద ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆరుగురు యువతీయువకుల బలుపు చేష్ట.. ఇద్దరు సామాన్యుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారినఈ ఉదంతంలోకి వెళితే.. సంపన్నుల దుర్మార్గం మరీ ఇంత దారుణమా? అన్న భావన కలుగక మానదు.

బెజవాడ బెంజి సర్కిల్ ఎగ్జిక్యూటివ్ క్లబ్ జంక్షన్ లో వేగంగా వచ్చిన రెండు కార్లు.. పలు బైకుల్ని ఢీ కొన్నాయి. ఇందులో రెండు బైకులు గాల్లోకి ఎగరటమే కాదు.. రెండు ముక్కలైన వైనం చూస్తే.. ప్రమాద తీవ్రత ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

పలువురికి గాయాలు కాగా.. ఇద్దరి ప్రాణాలకు మాత్రం డేంజర్ ఉందన్న మాటను వైద్యులు చెబుతున్నారు. విషమంగా ఉన్న వారి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఉదంతాన్ని చూస్తే.. పూటుగా తాగేసిన బలిసిన వారి పిల్లలు ఇందులో భాగస్వామ్యం అయి ఉంటారని చెబుతున్నారు.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం..ప్రమాదానికి కారణమైన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్లను నడిపినోళ్లు ఫార్చునర్ కార్లతో దూసుకొచ్చారు. వారి మధ్య రేసింగ్ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఎప్పుడైతే భారీ యాక్సిడెంట్ జరిగిన వెంటనే.. ఘటనాస్థలంలో కారును వదిలేసి పారిపోయారు. ప్రమాదం చేసిన కారులో ఇద్దరు అమ్మాయిలు.. ఇద్దరు అబ్బాయిలు ఉన్నట్లుగా చెబుతున్నారు. వారు పూటుగా తాగి ఉన్నారన్న ఆరోపణ కూడా ఉంది.

రేసింగ్ జోరులో ఉన్న కారు పలు వాహనాల్ని ఢీకొనగా.. ఇద్దరు ప్రయాణిస్తున్న రెండుస్కూటీల్ని బలంగా డీ కొట్టింది. దీంతో.. స్కూటీలు రెండు ముక్కలు కాగా.. దాని మీద ప్రయాణిస్తున్న నలుగురు గాల్లో ఎగిరి.. నేల మీద పడ్డారు. ఈ ఉదంతంలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రేసింగ్ వివరాల్ని సేకరించిన పోలీసులు.. నలుగురు అబ్బాయిలు.. నలుగురు అమ్మాయిల్ని అదుపులోకి తీసుకొని మాచవరం పోలీస్టేషన్ లో విచారిస్తున్నారు. ఇంతకూ ఫార్చునర్ తో రేసింగ్ పెట్టుకున్న వారెవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న దానిపై వివరాల్ని సేకరిస్తున్నారు. రేసింగ్ వెనుక ఉన్నదెవరు? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.