Begin typing your search above and press return to search.

మినిస్టర్ విజయశాంతి...చాన్స్ ఉందట !

ఇది సినిమా టైటిల్ కానే కాదు. తొందరలోనే తెలంగాణాలో మంత్రి అయ్యేందుకు రాములమ్మ చేస్తున్న ప్రయత్నాలలో ఒక ఆశాజనకమైన వాతావరణం నుంచి వస్తున్న వార్తగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   2 Jun 2025 9:31 AM IST
మినిస్టర్ విజయశాంతి...చాన్స్ ఉందట !
X

ఇది సినిమా టైటిల్ కానే కాదు. తొందరలోనే తెలంగాణాలో మంత్రి అయ్యేందుకు రాములమ్మ చేస్తున్న ప్రయత్నాలలో ఒక ఆశాజనకమైన వాతావరణం నుంచి వస్తున్న వార్తగా చెబుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతి ఎందుకు మంత్రి కాదు అన్న చర్చ కూడా ఉంది. ఆమెకు కాంగ్రెస్ కేంద్ర పెద్దల మద్దతు ఉందని అంటున్నారు.

సినిమా గ్లామర్ ఆమెకు ఉంది. అలాగే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా గుర్తింపు ఉంది. దాంతో పాటు మహిళా కోటాలో పెద్దల సభలో చాన్స్ ఉందని అంటున్నారు. అందుకే రాములమ్మ తన వంతుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు.

విజయశాంతి తాజాగా తెలంగాణా కాంగ్రెస్ ఇంచార్జి అయిన మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆమె మీనాక్షి నటరాజన్ ని కోరినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. పైగా బీసీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేసుకున్నారని అంటున్నారు.

ఇక మీనాక్షి నటరాజన్ వల్లనే విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందని అప్పట్లో ప్రచారం సాగింగి. కాంగ్రెస్ ని తెలంగాణాలో బలోపేతం చేయడం కోసం అన్ని వర్గాలను కలుపుకుని పోవాలని ఆమె కాంగ్రెస్ హై కమాండ్ కి చెప్పడమే కాదు సైలెంట్ గా ఉన్న విజయశాంతి లాంటి వారిని ఫోర్ ఫ్రంట్ లోకి తెచ్చారు అని అంటున్నారు. అలా ఆమె ఎమ్మెల్సీ అయ్యారని చెబుతున్నారు.

ఇపుడు మీనాక్షి నటరాజన్ కనుక తలచుకుంటే విజయశాంతి మినిస్టర్ అవుతారు అని అంటున్నారు. అతి తొందరలోనే వీలైతే ఈ వారంలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని అంటున్నారు కనీసంగా నలుగురు లేదా అయిదుగురుకి చాన్స్ ఉందని అంటున్నారు. మహిళలకు అవకాశం తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు.

అంతే కాదు రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేబినెట్ లో ఇక మహిళా ఫైర్ బ్రాండ్ కి పదవీ గండం తప్పదని అంటున్నారు. ఆమె ప్లేస్ లో విజయశాంతికి అవకాశం ఇస్తారని అంటున్నారు. పార్టీకి ప్రభుత్వానికి గ్రామర్ తో పాటు గ్రామర్ కూడా ఉండాలని అంతా భావిస్తున్నారు.

మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. వాటిలో మంచి గెలుపు చూపించాల్సి ఉంది. కాంగ్రెస్ లో వర్గ పోరు లేకుండా అంతా కలసికట్టుగా పనిచేస్తే విజయాలు సాధ్యం అని అంటున్నారు. ఇక విజయశాంతి తో పాటు సామాజిక సమీకరణలలో భాగంగా మరికొందరు సీనియర్లకు మంత్రులుగా చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా రాములమ్మ లక్ ఎలా ఉందో అన్నది కొద్ది రోజులలోనే తేలుతుందని అంటున్నారు.