జగన్ మీద విజయసాయి వ్యూహాత్మక మౌనం !
ఇక ఈ మధ్యనే జగన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విజయసాయిరెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
By: Tupaki Desk | 26 May 2025 11:30 AMవిజయసాయిరెడ్డి టీడీపీకి చెందిన కీలక నేత చంద్రబాబుకు ఆత్మగా భావించబడే టీడీ జనార్ధన్ ని కలిసారు అంటూ ఒక రోజంతా సోషల్ మీడియాను వైసీపీ హోరెత్తించింది. వీడియో ఇదేనని కూడా బయటపెట్టింది ఇది నిజంగా చూస్తే అతి పెద్ద సంచలనమే అయింది.
విజయసాయిరెడ్డి ఏమిటి టీడీపీకి చెందిన అతి ముఖ్యుడితో భేటీ కావడమేంటి అన్న చర్చ సర్వత్రా సాగింది. మరో వైపు చూస్తే ఇది జరిగి ఒక రోజు దాటినా విజయసాయిరెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ అయితే లేదు అని అంటున్నారు. సాధారణంగా ట్వీట్లకు పెట్టింది పేరు విజయసాయిరెడ్డి. ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ప్రత్యర్ధుల విషయంలో ఎక్కడా స్పేర్ చేయదు.
తనను ఎవరైనా ఏమైనా అంటే ఆయన వెంటనే రియాక్ట్ అవుతారు. అటువంటిది ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నా విజయసాయిరెడ్డి ట్విట్టర్ హ్యాండిల్ మౌనం దాల్చడం మీదనే అంతటా చర్చ సాగుతోంది. అదే సమయంలో ఆయన ట్వీట్లు వేయకుండా ఉన్నారా అంటే లేదు, ఆయన ఒక ట్వీట్ వేశారు. అయితే ఆ ట్వీట్ కరోనాకు సంబంధించినది. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన ట్వీట్ వేశారు.
తన మీద ఇంతలా రచ్చ జరుగుతూంటే ఆయన అసలు ఏమీ పట్టనట్లుగా కరోనా గురించి ట్వీట్ చేయడమేంటి అన్న చర్చ సాగుతోంది. విజయసాయిరెడ్డి ఇంత లైట్ గా ఈ ఇష్యూని తీసుకున్నారా అన్నది కూడా ఎవరికీ అంతుబట్టడంలేదు నిజానికి విజయసాయిరెడ్డి స్వభావం అది కాదని ఆయన రాజకీయ జీవితం చూసిన వారికి అర్థమవుతుంది అని అంటున్నారు.
ఇక ఈ మధ్యనే జగన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విజయసాయిరెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు. విజయసాయిరెడ్డి బాబుకు అమ్ముడు పోయారు అని తన మూడున్నరేళ్ళ పదవిని సైతం ఆయన తాకట్టు పెట్టేశారు అని కూడా తీవ్రంగానే విమర్శించారు. విజయసాయిరెడ్డి ప్రత్యర్ధుల వైపు వెళ్ళి వైసీపీ మీద చేసిన ఆరోపణలలో ఎలాంటి నిజం విలువ ఉండదని కూడా చెప్పుకొచ్చారు.
దీనికి కూడా విజయసాయిరెడ్డి అసలు కౌంటర్ ఇవ్వలేదు. ఇది జరిగి కూడా రోజులు గడిచాయి. మరి విజయసాయిరెడ్డి మౌనంగా ఎందుకు ఉంటున్నారు అన్నదే చర్చగా ఉంది. విజయసాయిరెడ్డి స్వభావం చూస్తే ఇలాంటి వాటి మీద చాలా వేగంగా రెస్పాండ్ అవుతారు అనే అంటారు. అలాంటిది ఆయన గమ్మున ఎందుకు ఉన్నారు అన్నదే చర్చగా ఉంది.
ఆయన నిజంగా బాబు శిబిరం వైపు ఉన్నారా. ఆయనకు అతి ముఖ్యుడైనా టీడీ జనార్ధన్ ని కలిశారా. ఆ విషయాలు బయటకు రావడంతోనే ఆయన సైలెంట్ అయ్యారా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే విజయసాయిరెడ్డి మౌనం వెనక ఒక వ్యూహం ఉందని అంటున్నారు. ఆయన ఇపుడే రియాక్ట్ కాదలచుకోలేదని అంటున్నారు ఆయన సరైన సమయంలోనే రియాక్ట్ అవుతారు అని అంటున్నారు.
ఆయన బీజేపీలో చేరడానికి చూస్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా ఆయన రాజకీయంగా రీ ఎంట్రీ ఒక గ్రాండియర్ గా ఇచ్చిన తరువాత వైసీపీని పూర్తిగా ప్రత్యర్ధిగా చేసుకుంటారని అంటున్నారు. వైసీపీలో ఆనుపానులు అన్నీ తెలిసిన విజయసాయిరెడ్డి గమ్మున ఉండే అవకాశాలే లేవు అని అంటున్నారు. ఆయున వల్ల వైసీపీకే ఇబ్బంది కానీ ఆయనకు పెద్దగా పోయేది ఏదీ లేదని అంటున్నారు.
మరో వైపు చూస్తే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నాను అని చెప్పిన తరువాత ఆయన ఎవరితో భేటీ అయితే తప్పేంటి అని సోషల్ మీడియాలో కొందరు అంటున్నారు. అంతే కాదు ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేశాక ఏ పార్టీతో ఉంటే ఏమిటి అని అంటున్నారు.
నిజంగా ఆయన కూటమిలో చేరాలనుకుంటే చేరి వైసీపీకి ఎదురునిలిచి రాజకీయం చేస్తే దానిని తట్టుకునే వ్యూహాలను వైసీపీ రూపొందించుకోవాలి తప్పించి ఆయన ఎక్కడ ఎవరితో ఉన్నారో ఆ వీడియోలను బయటపెడితే లాభమేంటి అన్న వారూ ఉన్నారు. మొత్తం మీద విజయసాయిరెడ్డి మౌనం వెనక ఏముందో తెలియక వైసీపీ వర్గాలు ఆ వైపే చూస్తున్నాయని అంటున్నారు. మరి విజయసాయిరెడ్డి తరువాత స్టెప్ ఏంటి అన్నదే చర్చగా ఉంది మరి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.