Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డి సీటూ లోటూ వైసీపీలో స్పష్టం!

కానీ విజయసాయిరెడ్డి విషయం తీసుకుంటే మాత్రం ఆయన సీటునూ లోటునూ అలాగే ఉంచేశారు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 5:30 AM
విజయసాయిరెడ్డి సీటూ లోటూ వైసీపీలో స్పష్టం!
X

విజయసాయిరెడ్డి రాజకీయ మేధావిగా గుర్తింపు పొందారు. ఆయన వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ఆయనకు రాజకీయాల మీద ఆశలు ఉండొచ్చు కానీ అందులో చేరిన వెంటనే అతి తక్కువ కాలంలో అంత ఉన్నతంగా రాణిస్తారు బహుశా ఎవరూ ఊహించి ఉండరు. విజయసాయిరెడ్డిలో అందరినీ కలుపుకుని పోయే తత్వం ఉంది. నేర్పూ ఓర్పూ ఉన్నాయి. లౌక్యం చాలానే ఉంది

ఇవన్నీ కలిసిన నాయకుడు కావడం వల్లనే ఇటు ఏపీలోనూ అటు ఢిల్లీలోనూ ప్రముఖ నాయకుడిగా రాణించారు. విజయసాయిరెడ్డి వైసీపీలో నంబర్ టూగా వెలిగారు. ఆయన ప్లేస్ ఏంటి అంటే జగన్ తరువాతనే అని అంతా చెబుతారు. అంతలా వైసీపీలో తనదైన ముద్ర బలంగా వేసిన విజయసాయిరెడ్డి ఆ పార్టీని వదిలేసి అచ్చంగా ఆరు నెలలు అయింది.

ఆయన రాజకీయాలు వద్దు అనుకునారు. వైసీపీ నుంచి తనకు దక్కిన రాజ్యసభ సీటు కూడా వద్దు అనుకున్నారు. తన మానాన తాను వెళ్ళిపోయారు. అయితే ఆయన వైసీపీని వీడినా ఆయన నిర్వహించిన పదవులూ ఆయన ప్లేసూ ఇక్కడ అక్కడ ఖాళీగానే ఉన్నాయని అంటున్నారు. వైసీపీలో ఇది అరుదైన విషయం అని అంటున్నారు.

ఎందుకంటే ఏ నాయకుడు బయటకు వెళ్ళినా ఆ వెంటనే ఆయన ప్లేస్ ని భర్తీ చేయడం వైసీపీ పెద్దలకు అలవాటు. కానీ విజయసాయిరెడ్డి విషయం తీసుకుంటే మాత్రం ఆయన సీటునూ లోటునూ అలాగే ఉంచేశారు. ఇది ఏ రకమైన సంకేతం అని అంతా చర్చించుకుంటున్నారు పార్టీని వీడిపోయిన విజయసాయిరెడ్డి మళ్ళీ వచ్చి పార్టీలో చేరుతారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. అంతే కాదు ఆయన రాక కోసమే అలా ఖాళీ వదిలేశారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు.

ఇక వైసీపీలో చూస్తే ఎందరో నాయకులు ఉన్నారు. జగన్ నీడగా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు ఉన్నారు. అయితే ఎందరు నేతలు ఉన్నా విజయసాయిరెడ్డి ప్లేస్ ని అయితే ఎవరూ భర్తీ చేయలేరని అంటున్నారు. అంటే ఆయనకు సమానమైన నాయకుడు వైసీపీలో లేరా అన్నది కూడా చర్చగా ఉంది.

ఇక విజయసాయిరెడ్డి 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీలో ఎంత కీలకంగా వ్యవహరిచారో అందరికీ తెలుసు అని అంటున్నారు. ఆయన ఢిల్లీ రాజకీయాల్లోనూ కీలకంగా ఉంటూ వైసీపీకి చేయాల్సిన మేలు చేశారు అని గుర్తు చేస్తున్నారు. ఇంకో వైపు చూస్తే కనుక విజయసాయిరెడ్డి విషయం మీద చూస్తే ఏ వ్యవహారం అయినా తనదైన శైలిలో చక్కబెట్టేవారు అని అంటారు. ఆయన ఇటు పార్టీ వ్యవహారాలు అయినా అటు ఢిల్లీ లాబీయింగ్ అయినా దేనిని అయినా చక్కబెట్టే చాకచక్యం ఉన్న నాయకుడిగా ముద్ర పడ్డారు.

అలాంటి నాయకుడు వైసీపీలో ఈ సమయంలో లేకపోవడం నిజంగా ఇబ్బందికరమే అని అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి చూస్తే ఏ పార్టీలో చేరలేదు. ఆయన ఖాళీగానే ఉంటున్నారు. పైగా వైసీపీ మీద ఆయన ఏ రకమైన విమర్శలు చేయడం లేదు. దాంతో ఏమైనా సానుకూలత అటూ ఇటూ ఉంటే కచ్చితంగా విజయసాయిరెడ్డి వైసీపీలో చేరవచ్చు అని అంటున్నారు.

ఇక విజయసాయిరెడ్డి మీద పార్టీలో తాజాగా చర్చ సాగిందని అంటున్నారు. అయితే ఆయన గురించి కానీ ఆయన నిర్వహించిన పోస్టుల గురించి కానీ ఏ రకమైన చర్చలు వద్దు అని ఒక కీలక నాయకుడు సూచించారు అని అంటున్నారు ఏది ఏమైన రాజకీయాల్లో ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికీ అంతు బట్టదు. అందువల్ల విజయసాయిరెడ్డి విషయమే తీసుకుంటే ఏమో కాలమే జవాబు చెపాల్సి ఉంది అని అంటున్నారు.