Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త పార్టీ-.విజయసాయి దెబ్బ ఎవరికి ?

ఇక ఏపీలో చూస్తే కొత్తగా పార్టీ పెట్టే దిశగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అడుగులు పడుతున్నాయని అంటున్నారు.

By:  Satya P   |   25 April 2026 11:00 PM IST
ఏపీలో కొత్త పార్టీ-.విజయసాయి దెబ్బ ఎవరికి ?
X

రాజకీయాల్లో ఈ ప్రశ్న అడగకూడదు. ఎందుకంటే అక్కడ చాన్స్ ఎవరూ ఇవ్వరు, ఎవరికి వరుగా జబర్దస్తుగా తీసుకోవాల్సిందే. ఉన్న వారే ఉంటారు, వారే కొనసాగుతామని అనుకుంటారు. రెండవ వారిని రానీయరు. అయితే రాజకీయాలు అంటే ప్రజలతో ముడి పడి ఉన్నవి కాబట్టి వారి మెప్పు పొందే ప్రయత్నం చేస్తే ఎవరైనా రావచ్చు. కానీ ఇదంతా గతం మునుపటిలా ఇపుడు రాజకీయాలు అయితే లేవు. బలంగా ఉన్న పార్టీలే మారుతున్నాయి పైగా ఓటు బ్యాంక్ కూడా వారికి పర్మనెంట్ గా ఉంది. దాంతో కొత్త పార్టీలు వచ్చినా నిలదొక్కుకోలేని పరిస్థితి ఉంది.

రాజకీయ శూన్యత :

ఏపీలోనే కాదు దేశంలోనూ రాజకీయాల్లో శూన్యత ఉంటూనే ఉంది. ఏ పార్టీ అయినా వాటి సిద్ధాంతాలు కాలలకు అతీతం కావు. జనరేషన్స్ మారుతూ ఉంటాయి. కొత్త తరం వస్తారు వారి అభిరుచులు కూడా మారుతాయి. అంతే కాదు ఎప్పటికపుడు అప్టేడ్ కావడం ఉన్న పార్టీలకు సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కసారి పార్టీ ఏర్పాటు అయ్యాక మూలాలు అలగే కొనసాగుతాయి పై పై మెరుగులు చూపించి మార్పు అని భ్రమ పెడతారు. ఆల్టర్నేషన్ లేనపుడు జనాలు కూడా అదే నిజం అనుకుంటారు. కానీ ప్రజల ఆశలు తీరనపుడు వారు వేరే దిక్కున చూస్తారు. అందువల్ల రాజకీయ శూన్యత అన్నది కచ్చితంగా ఉంటుంది.

ఈ జాఢ్యాలు పోవాలి :

రాజకీయాలు గతంతో పోలిస్తే ఇపుడు చాలా మారిపోయాయి. అనేక జాడ్యాలు అందులో ప్రవేశించాయి. కులం మతం ప్రాంతం వర్గం వర్ణం ఇలా అనేకమైనవి ఉన్నాయి. పైగా గతంలో లేని విధంగా అర్ధ బలం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇక ఓటర్లు ఎన్ని చెప్పినా గెలుపు గుర్రల మీదనే పందేలు కాయడం అప్పటికే ఎస్టాబ్లిష్ అయి ఉన్న పార్టీలకు మేలు చేస్తోంది. అదే సమయంలో కొత్తగా వచ్చిన పార్టీలు జీరో నుంచి స్టార్ట్ కావడం బహు కష్టంగా మారుతోంది.

విజయసాయిరెడ్డి ఎంట్రీ :

ఇక ఏపీలో చూస్తే కొత్తగా పార్టీ పెట్టే దిశగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అడుగులు పడుతున్నాయని అంటున్నారు. ఈ మేరకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆయన వైసీపీని టీడీపీని కలిపి విమర్శిస్తున్నారు. దాంతో ఆ రెండు పార్టీలలో చేరే చాన్స్ అయితే లేదు. ఒక టీడీపీ మిత్రులుగా ఉన్న కూటమి పార్టీలు జనసేన బీజేపీలలో కూడా చేరడం కష్టం అవుతుంది. దానికి టీడీపీ అంగీకరించాల్సి ఉంటుంది. ఇవన్నీ అయ్యేవి కావు. ఏపీలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. దాంతో వాటిలో చేరడం కంటే కొత్త పార్టీ వైపుగానే విజయసాయి రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు.

మీడియా బలంతోనే :

పార్టీతో పాటుగా సొంత మీడియాతో కూడా ఆయన రావాలని అనుకుంటున్నారు దాంతో తన రాజకీయానికి ఇంధనం తగిన విధంగా లభిస్తుంది అన్నది ఆయన ఆలోచన. ఇవన్నీ పక్కన పెడితే సామాజిక వర్గం పరంగా విజయసాయిరెడ్డి బలమైన వారే. అర్థ బలం కూడా ఉందని అంటున్నారు. మేధావిగా గుర్తింపు ఉంది. వైసీపీలో పదేళ్ళ పాటు పనిచేయడం వల్ల అనుభవం చాలానే ఉంది. ఇవన్నీ ఓకే కానీ పార్టీ పెట్టాలీ అంటే ఈజీయే కానీ దానిని జనంలోకి తీసుకుని పోవడానికి ఇమేజ్ ఉండాలి. ప్రజాకర్షణ శక్తి అని అంటారు విజయసాయిరెడ్డికి ఉన్న పొలిటికల్ గ్లామర్ ఎంత అన్న చర్చ సాగుతోంది. పైగా ఏపీలో రాజకీయం సామాజిక వర్గాల వారీగా చీలిపోయి ఉంది. కొత్త పార్టీ పెట్టి ఓట్లు గుంజుకోవాలీ అంటే వాటి నుంచే అన్నది కూడా ఉంది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి రాజకీయ ఉత్సాహానికి కొత్త పార్టీ వేదిక కావడం ఖాయం. కానీ అది ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది కాలమే నిర్ణయించాలని అంటున్నారు.