ఆధారాలతో విజయసాయి...ఏ పార్టీ టార్గెట్ ?
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తన ప్రెస్ మీట్ విశాఖలో అని చెప్పారు.
By: Satya P | 27 Sept 2026 8:26 PM ISTవైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తన ప్రెస్ మీట్ విశాఖలో అని చెప్పారు. ఆయన తొలి ప్రెస్ మీట్ కోస్తా కేంద్రం అయిన విజయవాడలో పెట్టారు, రెండవది రాయలసీమ కేంద్రం అయిన అనంతపురంలో నిర్వహించారు. ఇపుడు మూడవ మీడియా మీట్ ఉత్తరాంధ్ర కేంద్రం అయిన విశాఖలో అంటున్నారు. ఈ నెల 30న తాను నిర్వహించే ప్రెస్ మీట్ లో కొత్త ప్రతిపాదనలతో పాటు ఆధారాలతో వస్తున్నట్లుగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రహస్య పొత్తులు అంటూ :
విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర రాజకీయాల మీద మాట్లాడుతారు అన్నది అర్ధం అవుతోంది. ఆయన చాలా కాలం పాటు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉత్తరాంధ్ర జిల్లాలను చూశారు. ఆయనకు అక్కడ రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉంది. అందుకే ఆయన ఉత్తరాంధ్రాకు జరుగుతున్న అన్యాయం గురించి చెబుతాను అంటున్నారు. అలాగే రహస్య పొత్తులు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రా జిల్లాలలో టీడీపీ వైసీపీల మధ్య రహస్య పొత్తులు పార్టీలకు అతీతంగా నాయకుల స్థాయిలో ఉంటాయన్నది ప్రచారంలో ఉన్న మాట. మరి దీని మీదనేనా విజయసాయిరెడ్డి మాట్లాడేది అన్నది కూడా ఆలోచిస్తున్నారు. అదే జరిగితే ఆయన వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారా ఎవరు వారు అన్నది చూడాల్సి ఉంది. అలాగే టీడీపీలో నేతలు ఎవరు అన్నది కూడా చర్చకు వస్తోనిద్.
మత మార్పిడుల ఇష్యూ :
విజయసాయిరెడ్డి విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మత మార్పిడుల అంశాన్ని ప్రస్తావించారు. ఇపుడు మళ్లీ విశాఖలో అదే ఇష్యూ మీద మాట్లాడుతాను అంటున్నారు. ప్రత్యేకించి గిరిజనుల మత మార్పిడుల మీద మాట్లాడుతాను అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో గిరిజనం పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడ మత మార్పిడులు ఏమైనా ఉన్నాయని ఆయన భావిస్తున్నారా, ఆయన వాటి మీద అధారాలతో సహా మాట్లాడుతారా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. మరి మత మార్పిడుల విషయంలో ఏ రాజకీయం ఉంది, ఎవరు ప్రోత్సహిస్తున్నారు అన్నది ఏమైనా ఆయన చెబుతారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు.
సంచలనమేనా :
విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ లో ఆధారాలతో సహా అంటున్నారు. కాబట్టి సంచలనమేనా అని కూడా డిస్కషన్ సాగుతోంది. ఆయన ఏ పార్టీని టార్గెట్ చేస్తారు అన్నది కూడా ఆసక్తిని పెంచుతోంది. అయితే వైసీపీలోనే ఎక్కువగా పనిచేసిన ఆయన ఆ పార్టీనే గురి పెడుతూ వస్తున్నారు. ఆయన గత రెండు ప్రెస్ మీట్ లలో వైసీపీనే ఎక్కువగా ఫోకస్ చేశారు. అనంతపురం ప్రెస్ మీట్ లో ఒరిజినల్ రెడ్లు అన్న పదం వాడారు. అంతకు ముందు విజయవాడలో మాట్లాడుతూ మత మార్పిడిల గురించి చెప్పారు. ఇపుడు విశాఖ ప్రెస్ మీట్ లో కూడా బాంబు పేల్చబోతున్నారా అన్నదే చర్చగా ఉంది. మొత్తం మీద చూస్తే విజయసాయిరెడ్డి పెద్ద మ్యాటర్ నే రివీల్ చేయబోతున్నారు అని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఆయన చెప్పే రహస్య పొత్తులు అయితే రాజకీయంగా వేడిని పెంచేస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. విశాఖ వేదికగా ఉత్తరాంధ్రా రాజకీయాల గుట్టుని ఆయన ఎలా విప్పుతారో.
