Begin typing your search above and press return to search.

కీలకమైన ఎన్నికల వేళ విజయమ్మ సంచలన నిర్ణయం ?

ఆమె ఏకంగా ఎన్నికలు ముగిసేంతవరకూ ఏపీలోనే కాదు దేశంలోనే ఉండకూడదు అని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   13 April 2024 2:30 AM GMT
కీలకమైన ఎన్నికల వేళ విజయమ్మ సంచలన నిర్ణయం ?
X

వైఎస్ విజయమ్మ ఏపీలో ఎన్నికల హీట్ సమ్మర్ హీట్ ని మించే వేళ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఆమె ఏకంగా ఎన్నికలు ముగిసేంతవరకూ ఏపీలోనే కాదు దేశంలోనే ఉండకూడదు అని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. ఆమె విదేశాలకు పయనం అవుతున్నారు అని అంటున్నారు.

ఆమె ఎన్నికల వేడి ముగిసి ఫలితాలు వచ్చేంతవరకూ తిరిగి దేశంలోకి అడుగుపెట్టరని ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దాని కోసం ఆమె అన్ని ఏర్పాట్లను చేసుకున్నారు అని అంటున్నారు. ఆమె ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి వైఎస్సార్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలే కారణం అని అంటున్నారు.

ఆమె కుమారుడు వైఎస్ జగన్ వైసీపీ అధినేతగా ఉంటున్నారు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికలను జగన్ ఎంతటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో గెలుపు జగన్ కి చాలా ముఖ్యమని అంతా అంటారు. ఈసారి ఆయన నెగ్గితే చాలు ఇక తిరుగు ఉండదు, ఓడితే ఇబ్బందులు వస్తాయని కూడా అంటారు.

అలా కుమారుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూంటే కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె పీసీసీ చీఫ్ గా ఉంటూ ఏకంగా కడప గడ్డ మీదనే జగన్ ని సవాల్ చేస్తున్నారు. అమె తెలంగాణాలో పార్టీ పెడితే పూర్తిగా సపోర్ట్ చేసిన విజయమ్మ ఆమె ఏపీ వైపు చూస్తే మాత్రం పక్కన లేరు.

అంటే ఆమెకు ఇది ఇబ్బందికరం కాబట్టే అలా చేశారు అని అంటున్నారు. కుమారుడు మళ్లీ సీఎం కావాలని ఆమె మనసారా కోరుకుంటున్నారు అని అంటున్నారు. అయితే జగన్ కి ఎదురు నిలిచిన షర్మిలని ఆమె దీవిస్తున్నారు. ఆమె రాజకీయ ఆకాంక్షలను కాదనలేకపోతున్నారు. దాంతో ఆమె ఎటూ తేల్చుకోలేక ఇద్దరు బిడ్డల మధ్య చెలరేగిన రాజకీయ సమరాన్ని చూస్తూ ఉండలేక తల్లడిల్లుతున్నారు అని అంటున్నారు.

ఈ పరిస్థితులలో ఎవరికి వారు తమకు ప్రచారం చేయమని ఆమె మీద వత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అలా ఆమె ఏదో ఒక పక్షం ఉండడం కూడా అసలు కుదిరేది కాదు. ఆమె చేయలేరు కూడా. అందుకే తాను ఎవరి పక్షం కాదని తాను తల్లిగా ఇద్దరి మేలు కోరుకుంటాను ఆమె చెబుతున్నారు. ఇక ఏపీలో ఉండడం కన్నా ఈ కష్ట సమయమో విదేశాలకు వెళ్ళి కొన్నాళ్ళు అక్కడే ఉండి రావాలని ఆమె నిర్ణయించుకున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వస్తే అప్పటికి ఎవరేమిటి అన్నది తెలుస్తుంది అంతా సర్దుకుంటుంది అన్న ఆలోచనతో ఆమె ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి విజయమ్మ తీసుకుంటున్న ఈ సంచలన నిర్ణయం వైఎస్సార్ ఫ్యామిలీతో పాటు రాజకీయ వర్గాలలో చర్చగా ఉంది. ఏ తల్లికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని, బిడ్డలు తల్లి కళ్ల ఎదుటే సవాల్ చేసుకుంటే ఏ తల్లి అయినా ఏమి తీర్పు చెప్పగలదు అని అంటున్న వారూ ఉన్నారు.

మొత్తానికి విజయమ్మ ఈసారి ఎన్నికలకు దేశానికే దూరంగా ఉండబోతున్నారు అని అంటున్నారు. గతసారి ఎన్నికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి జగన్ ని సీఎం గా చూడాలనుకున్న విజయమ్మ ఈసారి మాత్రం వైసీపీకి దూరం అయ్యారు. అలాగే కుమార్తె వైపు కూడా ఉండలేకపోతున్నారు. అందుకే ఈ తటస్థ నిర్ణయం అని అంటున్నారు.