Begin typing your search above and press return to search.

వైసీపీ రెడ్లే సాయిరెడ్డి టార్గెట్టా.. !

ఏపీలో రాజకీయ గ్యాప్ కనిపిస్తోందని, దీనిని భర్తీ చేసేందుకు తాను సొంతంగా పార్టీ పెడుతున్నానని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

By:  Garuda Media   |   27 April 2026 10:55 PM IST
వైసీపీ రెడ్లే సాయిరెడ్డి టార్గెట్టా.. !
X

రాష్ట్రంలో 22 శాతంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓటింగ్ అన్ని పార్టీలకు కీలకమే. ఈ విషయంలో వైసిపి మాత్రమే రెడ్ల దగ్గర పేటెంట్ పుచ్చుకోలేదు. టిడిపి మాత్రమే రెడ్లను ఓన్ చేసుకోలేదు. అన్ని పార్టీల్లోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. వారి ప్రభావం కూడా ఉంది. అయితే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా సామాజిక వర్గం.. రాజకీయాలు కొనసాగుతున్నాయి.

2019 ఎన్నికల సమయంలో రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి పూర్తిగా అనుకూలంగా మారింది. 2024 నాటికి వారు వ్యూహం కూటమి వైపు మళ్ళింది. తద్వారా తమకు మేలు జరుగుతుందని రెడ్డి సామాజిక వర్గం అంచనా వేసుకుంది. సరే ఇప్పుడు ఎట్లా ఉంది.. వారు సంతోషంగా ఉన్నారా ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయ సాయి రెడ్డి కొత్తగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.

ఏపీలో రాజకీయ గ్యాప్ కనిపిస్తోందని, దీనిని భర్తీ చేసేందుకు తాను సొంతంగా పార్టీ పెడుతున్నానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా సహజంగానే రెడ్డి సామాజిక వర్గం విజయసాయి రెడ్డి వైపు ముగ్గు చూపే అవకాశం ఉంటుంది. గతంలో ఆయనతో కలిసి ప్రయాణించిన అనేకమంది రెడ్డి వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆయన పెట్టే పార్టీకి మద్దతుగా నిలుస్తారా నిలవరా అనేది చూడాలి. ఎందుకంటే ఒక అకౌంటెంట్‌గా సాయిరెడ్డి తో ఉన్న పరిచయం వేరు.

ఇప్పుడు రాజకీయంగా వేసే అడుగులు భిన్నంగా ఉంటాయి. అప్పట్లో ఆయనను సమర్థించిన వారు చాలామంది ఉన్నారు. అదే విధంగా రాజకీయంగా మద్దతు ఇచ్చిన వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకుంటున్న నేపథ్యంలో వ్యక్తిగతంగా సాయి రెడ్డికి ఉన్న మద్దతు ఎంత.. ఆయన ఏ మేరకు ప్రజలను ప్రభావితం చేయగలరు.. అనే విషయం అత్యంత ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గమే ఈ విషయంలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందన్న చర్చ కూడా నడుస్తుంది. దీనిని బట్టి విజయ్ సాయి రెడ్డి వైపు ఎంతమంది రెడ్లు మొగ్గు చూపుతారు అనేది చూడాలి. ఏది ఏమైనా ఇది వైసీపీకి ఒకరకంగా ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉందని ప‌రిశీల‌కులు అంచనా వేస్తున్నారు.