గుజరాత్ మాజీ సీఎంతో చివరి వరకూ నడిచిన 'లక్కీ నెంబర్'!
అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందారు.
By: Tupaki Desk | 13 Jun 2025 9:52 AM ISTఅహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందారు. ఆయన పూర్తి పేరు.. విజయ్ భాయ్ రామ్నిక్ లాల్ భాయ్ రూపానీ. 1956 ఆగస్టు 2న మయన్మార్ లో జన్మించిన ఆయన... 68 ఏళ్ల వయసులో తాజా విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
అయితే.. వారిలో ఒక కుమారుడు పూజిత్.. గతంలో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందారు. మృదు స్వభావిగా, విశ్వసనీయ నేతగా పేరు సంపాదించుకున్న విజయ్ రూపానీ... కార్పొరేటర్ గా, మేయర్ గా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. ఈ సందర్భంగా ఆయన అదృష్ట సంఖ్యపై ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
అవును... గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన అదృష్ట సంఖ్య “1206”గా భావించారట. ఇందులో భాగంగా.. అతని మొదటి స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ నుంచి ఆ తర్వాత కొన్న కార్లు, బైకులు సహా అన్ని వాహనాలకు ఇదే నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించారని చెబుతారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ 1206 నెంబర్ తనకు బాగా కలిసొచ్చిందని ఆయన నమ్ముతారంట. అయితే ఊహించని రీతిగా, తాజాగా జరిగిన విషాధ ఘటన కూడా జూన్ 12న జరిగింది. అంటే... "12-06". అది కూడా ఆయన లక్కీ నెంబర్ తో సరిపోలుతుండటం గమనార్హం. ఇది కచ్చితంగా విధి ఆడిన వింత నాటకం అంటూ ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.
