Begin typing your search above and press return to search.

ప్రజల్లోకి దళపతి విజయ్... ఎలా, ఎప్పుడు ప్లాన్ చేశారంటే..?

అవును... వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   7 Jun 2025 12:52 PM IST
ప్రజల్లోకి దళపతి విజయ్... ఎలా, ఎప్పుడు ప్లాన్  చేశారంటే..?
X

తమిళ సూపర్ స్టార్, టీవీకే అధికేత విజయ్... క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి, దూకుడు ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఆయన కేడర్ కు పిలుపునిస్తున్నారు. ఈ సమయంలో విజయ్ ప్రజల చెంతకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది!

అవును... వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాలను త్రిముఖ పోటీగా మార్చిన తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్.. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం మొత్తం 42 రోజులు పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇక ఆ యాత్ర నుంచి మొదలు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో చివరి సినిమా షూటింగ్ షెడ్యూల్ ను మేనేజ్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళనున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా ఈ 42 రోజులు పాటు సాగేలా ప్లాన్ చేస్తున్న ఈ యాత్రను జూన్ రెండో వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించాలను ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

అయితే... జూన్ రెండోవారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆగస్టు అయితేనే బెటర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఇక ఈ ప్రయాణాన్ని తిరుచ్చి లేదా మదురై నుంచి ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దీనికోసం ఓ ప్రత్యేక ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు!

'జననాయగన్' టీమ్ విందులో ఎమోషనల్!:

మరోవైపు.. విజయ్ 69వ చిత్రానికి "జననాయగన్" అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... ఇదే తన చివరి సినిమా అని విజయ్ స్వయంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా టీమ్ కు విందును ఏర్పాటు చేశారు. ఆ విందులో విజయ్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తన నట జీవితంలో చివరిది అని చెబుతూ.. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలోని సహచరులతో కలిసి గడిపిన క్షణాలు తలచుకుంటూ ఎమోషనల్ అయ్యారని అంటున్నారు.