Begin typing your search above and press return to search.

విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై కట్టప్ప ఘాటు రియాక్షన్!

అవును... విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   29 Sept 2025 6:03 PM IST
విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై  కట్టప్ప ఘాటు రియాక్షన్!
X

సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్‌.. కరూర్‌ లో జరిపిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు 40 మంది మరణించగా.. సుమారు 80 మందికిపైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. విచారణకు ఆదేశించింది.

ఈ ఘటనకు గల కారణాలపై తమిళనాడు డీజీపీ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ప్రభుత్వం మృతులకు రూ.10 లక్షలు, విజయ్ రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇదే సమయంలో... ఈ ఘటనపై పలువురు స్టార్లు స్పందించారు. ఈ క్రమంలో తాజాగా నటుడు సత్యరాజ్‌ రియాక్ట్‌ అయ్యారు. విజయ్ పై పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు.

అవును... విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాట అనంతరం విజయ్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సత్యరాజ్ స్పందించారు. విజయ్ పై పరోక్షంగా ఘాటు విమర్శలు చేస్తు గట్టి కౌంటర్ వేశారు!

ఇందులో భాగంగా... "ఒక్కోసారి తప్పులు అనేవి మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. కానీ, తెలిసి ఎవరైనా తప్పు చేస్తే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే, వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. అది చిన్న తప్పు అయితే దాన్ని సరిచేసుకోవాలి. ఒకవేళ అది అనుకోకుండా పెద్దదైతే మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఛీ!" అంటూ సత్యరాజ్ పోస్ట్‌ చేశారు.

సరిగ్గా గమనిస్తే సత్యరాజ్ పోస్టులో భారీ కౌంటర్లే ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే... విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఆయన సభల్లో 8 మంది మరణించారు. తను ప్రయాణించే వాహనం కింద పడిపోయి కొంతమంది బైకర్స్‌ తీవ్రంగానే గాయపడ్డారు. ఇలా తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఈ విషయాన్నే సత్యరాజ్‌ ప్రధానంగా పరోక్షంగా ప్రస్థావించారు! తను పాల్గొంటున్న ర్యాలీలో ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం తెలిసినప్పటికీ విజయ్ నిర్లక్ష్యం వహిస్తున్నారనో, అశ్రద్ధగా ఉంటున్నారనో సత్యరాజ్‌ పరోక్షంగా చెప్పారని అంటున్నారు.

విజయ్ ను అరెస్ట్ చేయాలంటూ పోస్టర్లు!:

కరూర్‌ లో టీవీకే అధినేత విజయ్ జరిపిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగిన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ దుర్ఘటనపై విచారణకు ఏకసభ్య కమిషన్‌ ను ప్రభుత్వ నియమించింది. ఆ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ తెలిపారు. ఈ క్రమంలో.. విజయ్ ను అరెస్ట్ చేయాలంటూ కరూర్ లో పోస్టర్లు వెలియడం కలకలం రేపుతోంది.