Begin typing your search above and press return to search.

అసమ్మతి షురూ : రేవంత్ పై వీహెచ్ ఎందుకు మొదలెట్టాడు

గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పులే కాంగ్రెస్ పార్టీ వారు చేస్తుండటంతో వీహెచ్ కినుక వహిస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 March 2024 1:01 PM GMT
అసమ్మతి షురూ : రేవంత్ పై వీహెచ్ ఎందుకు మొదలెట్టాడు
X

కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. దీంతో సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంత రావు పార్టీలోకి బీఆర్ఎస్ నేతల వలసలను ఖండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను చేర్చుకుంటే సీనియర్లకు అన్యాయం చేసినట్లు అవుతుందని పెదవి విరుస్తున్నారు.

గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పులే కాంగ్రెస్ పార్టీ వారు చేస్తుండటంతో వీహెచ్ కినుక వహిస్తున్నారు. బీఆర్ఎస్ ను కాదని ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తే వారిని మన పార్టీలో చేర్చుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న తీరు వల్ల పార్టీకే నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది తన స్థాయికి తగదని హితవు పలుకుతున్నారు.

కాంగ్రెస్ ప్రవేశపెట్టిన జనాకర్షక పథకాలకు ఆకర్షితులవుతున్నారు. దీంతోనే బీఆర్ఎస్ నేతలు పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలను చేర్చుకుంటే సీనియర్లకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఇలా ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం వల్ల పార్టీకే తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆక్షేపిస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా పార్టీ సేవల్లో ఉన్న వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాల్సిన అవసరం ఏర్పడింది. వారి సేవలను వినియోగించుకున్నపార్టీ వారికి సరైన దారి చూపించాల్సిందే. పార్టీ పదవులు అప్పగించి వారిని సంతోష పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలా ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తే సొంత పార్టీ నేతల భవితవ్యం అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఇతర పార్టీల వారిని తీసుకోవడం సముచితం కాదు. కార్యకర్తలకు అన్యాయం చేయొద్దు. రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నేతలను తీసుకోవడంపై ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం మంచిది కాదు. ఏ పార్టీలో ఉన్న వారు అదే పార్టీలోనే ఉండటం శ్రేయస్కరం. అంతేకాని వారిని పార్టీలోకి తీసుకుంటూ పరువును తీసుకోవడం సమంజసం కాదని చెబుతున్నారు.

కాంగ్రెస్ లో ముసలం మొదలవుతోందా? ఇప్పుడిప్పుడే అందరు కలిసిపోతున్నా సీనియర్ నేత హనుమంత రావు పార్టీలో ఇతరుల చేరిక మీద తనదైన శైలిలో విమర్శలు చేయడం వివాదానికి తెరతీస్తోంది. కలుపుగోలుగా ఉన్న పార్టీలో విభేదాలు పొడచూపుతున్నాయా అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్ లో ఉన్న ఆచారం ఏంటంటే ఒకరు పెదవి విరిస్తే వారి వెంట మరికొందరు చేరడం మామూలే.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో కూడా లుకలుకలు స్టార్ట్ అవుతున్నాయా? సీనియర్లు మెల్లగా విమర్శల గళం వినిపిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న నావ నడిసంద్రంలో సుడిగాలిలో చిక్కుకుంటుందా? అనే సంశయాలు చాలా మందిలో వస్తున్నాయి. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా ఎంత మంది నిరసన వ్యక్తం చేస్తారో వేచి చూడాలి మరి.