Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్.. కేంద్ర మాజీ మంత్రి కావూరి మృతి

సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మరణించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కావూరి హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   9 March 2026 3:40 PM IST
బిగ్ బ్రేకింగ్.. కేంద్ర మాజీ మంత్రి కావూరి మృతి
X

సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మరణించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కావూరి హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వ్యాపార, రాజకీయ రంగాల్లో విశేష అనుభవం గడించిన కావూరి రాష్ట్ర విభజన నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మచిలీపట్నం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 5 సార్లు గెలిచిన ఆయన ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన మరణించారన్న సమాచారంపై రెండు రాష్ట్రాలకు చెందిన నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న పెదపారుపూడి మండలం దోసపాడు అనే గ్రామం కావూరి సాంబశివరావు స్వస్థలం. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన 82 సంవత్సరాలు. 2013లో కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కావూరి సాంబశివరావు 2014లో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే 2014 తర్వాత వృద్ధాప్య కారణాలతో రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.

1984లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి కావూరి సాంబశివరావు తొలిసారిగా ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1989, 1998లోనూ అదే నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక 2004లో ఏలూరు నియోజకవర్గానికి మారిన కావూరి వరుసగా రెండుసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. 2013లో మంత్రిగా బాధ్యతలు చేపట్టి, 2014లో రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన వారసులు ఎవరూ ఈ నియోజకవర్గాల నుంచి పోటీకి ఆసక్తి చూపలేదు. కానీ, కావూరి మనవడు శ్రీభరత్ ప్రస్తుతం విశాఖ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.