Begin typing your search above and press return to search.

కారు స్క్రాప్ కింద అమ్ముకున్నారు!

గతకొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలు బీఆరెస్స్ పై విమర్శల దాడిని పెంచుతూపోతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Jan 2024 4:07 AM GMT
కారు స్క్రాప్  కింద అమ్ముకున్నారు!
X

గతకొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలు బీఆరెస్స్ పై విమర్శల దాడిని పెంచుతూపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. బీఆరెస్స్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా కారు సర్వీసింగ్ కు పోలేదని.. దాన్ని ఎప్పుడో ముక్కలు చేసి కిలోల చొప్పున స్క్రాప్ కింద అమ్ముకున్నారని వెంకట్ రెడ్డి అన్నారు.

ఇదే సమయంలో.. తాము తలుచుకుంటే బీఆరెస్స్ ను 14 ముక్కలు చేయగలమని ఫైర్ అయ్యారు. తాజాగా బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కు చెందిన క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ సభలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే బీఆరెస్స్ నేతలు అవాక్కలు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.

ఇందులో భాగంగా... కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఆరు నెలలే ఉంటుందని ఒకరంటే.. కేవలం సంవత్సరమేనని మరొక్కరు అంటున్నారని తెలిపారు. వాస్తవానికి బీఆరెస్స్ ఎమ్మెల్యేలు కొంతమంది తమతో టచ్ లో ఉన్నారని.. అయితే తమకు సరిపడా మెజారిటీ ఉందని.. తాము తలచుకుంటే కారు ముక్కలు కన్ ఫాం అని తేల్చి చెప్పారు.

గత పదేళ్లలో జరిగినంత అవినీతి...!:

ఉమ్మడి రాష్టం నుండి లెక్కపెడితే తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత గత పదేండ్లలో జరిగినంత అవినీతి ఎన్నడూ జరగలేదని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి... 11 వందల మంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం కబ్జా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన పదేండ్లల్లో తెలంగాణ ప్రజలను బతుకమ్మ చీరలకే పరిమితం చేశారని ఆరోపించారు.

ఇదే సమయంలో... నాడు తెలంగాణ రాష్ట్రం కోసం తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలివేసినట్టు గుర్తుచేసుకున్న మంత్రి కోమటిరెడ్డి... త్యాగధనులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత తప్ప ఎవరూ బాగుపడలేదని దుబ్బయట్టారు.