Begin typing your search above and press return to search.

పాత గూటికి వైసీపీ నేత‌.. జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌లే త‌రువాయి.. !

రాజ‌కీయాల్లో ఎవ‌రూ శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు. ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులు కూడా ఉండ‌రు. నాయ‌కులకే కాదు.. పార్టీల‌కు ఇది వ‌ర్తిస్తుంది.

By:  Tupaki Desk   |   29 July 2025 9:00 AM IST
పాత గూటికి వైసీపీ నేత‌.. జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌లే త‌రువాయి.. !
X

రాజ‌కీయాల్లో ఎవ‌రూ శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు. ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులు కూడా ఉండ‌రు. నాయ‌కులకే కాదు.. పార్టీల‌కు ఇది వ‌ర్తిస్తుంది. అవ‌స‌రం-అవ‌కాశం అనే రెండు ప‌ట్టాల‌పై ప్రయాణం చేసే రాజ‌కీయాలు.. ఎక్క‌డికి ఏది అవ‌స‌ర‌మో.. దానిని పాటిస్తూ.. ఉంటాయి. ఇదే జంపింగుల‌కు క‌లిసి వ‌స్తున్న అంశం. నాయ‌కుల‌కు రాజ‌కీయాలు క‌లిసి వ‌స్తున్న అంశం కూడా!. ఈ క్ర‌మంలోనే తాజాగా వైసీపీకి చెందిన కీల‌క నాయ‌కుడు ఒక‌రు త‌న పాత పార్టీలోకి వెళ్లిపోయేందుకు రంగం రెడీ చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఆయ‌నే విజ‌య‌వాడ‌కు చెందిన ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌. గ‌తంలో ప్ర‌జారాజ్యం నుంచి రాజ‌కీయాలు ప్రారంభించిన వెల్లంప‌ల్లి .. ఆ పార్టీ త‌ర‌ఫున 2009లో విజ‌యం కూడా ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. అనూహ్యంగా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డంతో స్థానికంగా జ‌లీల్ ఖాన్‌తో ఉన్న విభేదాలా కార‌ణంగా.. కాంగ్రెస్‌లోకి వెష‌ళ్ల‌కుండా.. ఆయ‌న బీజేపీ పంచ‌న చేరిపోయారు. ఈ పార్టీ త‌ర‌ఫునే 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో వెల్లంప‌ల్లి ప‌రాజ‌యం పాల‌య్యారు.

అనంతరం.. ఆ పార్టీని కూడా వ‌దిలేశారు. 2019 నాటికి వైసీపీలోకి వ‌చ్చి.. ఆ పార్టీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కిం చుకున్నారు. వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన వెల్లంప‌ల్లి జ‌గ‌న్ హ‌యాంలో మంత్రి కూడా అయ్యారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గాన్ని మార్పు చేయ‌డంతో ఆయ‌న సెంట్ర‌ల్ నుంచి పోటీ చేసి ప‌రా జ‌యం పాల‌య్యారు. నియోజ‌క‌వ‌ర్గం కొత్త కావ‌డం.. పార్టీలో ఈ సీటును ఆశించిన మ‌ల్లాది విష్ణుతో విభేదా లు ఉండ‌డంతో స‌హ‌కారం కొర‌వ‌డి.. ఓడిపోయార‌న్న ఆవేద‌న ఆయ‌న‌లో ఉంది.

దీంతోనేవెల్లంప‌ల్లి.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. యాక్టివ్‌గా పాలిటిక్స్ చేయ‌డం లేదు. అంతేకాదు.. పార్టీ కార్య క్రమాల‌కు కూడా మ‌న‌సు పెట్టి పాల్గొన‌డం లేదు. ఇక‌, తాజాగా ఆయ‌న త‌న ఒక‌ప్ప‌టి మిత్రుడు పీవీఎన్ మాధ‌వ్‌.. బీజేపీ రాష్ట్ర చీఫ్ కావ‌డంతో ఇప్పుడు ఆ పార్టీవైపు దృష్టి పెట్టార‌ని తెలిసింది. ఇటీవ‌ల అత్యంత ర‌హ‌స్యంగా మాధ‌వ్‌తో ఆయ‌న హైద‌రాబాద్‌లో భేటీ అయిన‌ట్టు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ నేత సుజ‌నా చౌద‌రి.. ఎమ్మెల్యేగా ఉండ‌డంతో పార్టీలోకి తీసుకునేందుకు.. మాధ‌వ్ త‌ట‌ప‌టాయిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యంపై మాధ‌వ్ క‌స‌ర‌త్తు అయితే చేస్తున్నారని స‌మాచారం. ఒక‌వేళ‌.. సుజ‌నా చౌద‌రి.. వ‌చ్చే ఎన్నిక ల‌నాటికి ఎంపీగా వెళ్లే ఉద్దేశం ఉంటే.. వెల్లంప‌ల్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.