Begin typing your search above and press return to search.

శాకాహారులకు జొమాటో గుడ్ న్యూస్

ఆన్ లైన్ లో ఫుడ్ ను ఆర్డర్ చేసే ట్రెండ్ అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   20 March 2024 4:37 AM GMT
శాకాహారులకు జొమాటో గుడ్ న్యూస్
X

ఆన్ లైన్ లో ఫుడ్ ను ఆర్డర్ చేసే ట్రెండ్ అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఇంట్లో వంట కంటే బయట నుంచి ఆర్డర్ చేసుకొని తెప్పించుకునే జీవనశైలి పెరుగుతున్న వేళ.. పుడ్ యాప్ లకు ఆదరణ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటి వేళ.. తమకు ఆర్డర్ చేసే వినియోగదారుల అభిరుచులకు.. సెంటిమెంట్లకు పెద్ద పీట వేసేలా జొమాటా తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

శాకాహారమే తీసుకునే వెజ్ కస్టమర్ల కోసం జొమాటో ‘ప్యూర్ వెజ్ ప్లీట్’ పేరుతో ప్రత్యేక సేవల్ని షురూ చేసింది. పలువురు వెజ్ వినియోగదారులు తమకు చేస్తున్న విన్నపాల నేపథ్యంలో తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. వెగాన్ వినియోగదారులు తమ ఫుడ్ ను తీసుకొచ్చే బాస్కెట్ లో నాన్ వెజ్ ఫుడ్ ను కూడా డెలివరీ చేయటం తెలిసిందే. ఇలాంటివి ప్యూర్ వెజ్ ప్రియులకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి.

అంతర్జాతీయంగా చూస్తే భారత్ లోనే అత్యధిక శాతం శాకాహారులు ఉంటారు. ఇలాంటి వేగాన్ వినియోగదారుల కోసం కేవలం శాకాహారమే అందించే రెస్టారెంట్లను ఎంపిక చేసుకోవటంతో పాటు.. నాన్ వెజ్ ఆహారాన్ని డెలివరీ చేసే బాక్సుల్లో కాుండా వెజ్ ప్రియుల కోసమే ప్రత్యేకంగా బాక్సుల్ని ఏర్పాటు చేస్తారు. సాధారణంగా జొమాటో డెలివరీ బాయిస్ రెడ్ కలర్ బాక్సుల్ని వినియోగిస్తారు. వెజ్ వినియోగదారుల కోసం గ్రీన్ కలర్ డెలివరీ బాక్సుల్ని వినియోగిస్తారు. ఇంతకాలానికి వెజ్ ప్రియుల సెంటిమెంట్లను జొమాటో గుర్తించినట్లైంది. తాజా ఎత్తుగడ జొమాటోకు మరింత ఇమేజ్ ను తీసుకొస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.