Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో పోటీపై వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

తాజాగా రాజమండ్రిలో మైకుల ముందుకు వచ్చిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన అడ్రస్ ను గుర్తుచేస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 8:14 AM GMT
ఎన్నికల్లో పోటీపై  వీర్రాజు  ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. నిన్నమొన్నటివరకూ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ - జనసేన కూటమి మధ్యే పోటీ అనుకుంటున్న దశలో అటు కాంగ్రెస్ నుంచి కీలక నేతలు, ఇటు బీజేపీ నుంచి సీనియర్ నేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకఓటుపై బెమ పడుతున్నట్లున్నారు! ఈ సమయంలో ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతలు తమ అభిప్రాయాలు, కోరికలు బయటపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు స్పందించారు. తాజాగా రాజమండ్రిలో మైకుల ముందుకు వచ్చిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన అడ్రస్ ను గుర్తుచేస్తున్నారు.

ఇందులో భాగంగా... అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడినుండే పోటీకి సిద్ధం.. అయితే నాది రాజమండ్రి.. అయినప్పటికీ అంతిమ నిర్ణయం అధిష్టానానిది అని చెబుతున్నారు! ఇక, సంక్రాంతి పండగలోపు 32 మందితో ఎన్నికల కమిటీ నియమిస్తామని.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకు సంస్థాగత కమిటీలు వేస్తాం అని సోము తెలిపారు.

అనంతరం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు సోము వీర్రాజు. ఇందులో భాగంగా... నవరత్నాలు అనేవి కేవలం కంటి తుడిపి చర్యగా అభివర్ణించారు సోము వీర్రాజు. వైసీపీ అనాలోచిత నిర్ణయాలు తప్ప, అభివృద్ధి ఏమి లేదని ఫైరయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కేంద్రంలోని మోడీ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు.