Begin typing your search above and press return to search.

అప్పట్లో పేపర్ బాయ్.. ఇప్పుడు ఎమ్మెల్యే.. అయినా ఇందిరమ్మ ఇంట్లోనే

ఎమ్మెల్యే దాకా ఎందుకు? సర్పంచ్ గా గెలిస్తేనే.. ఫార్చ్యునర్ లో తిరిగే పరిస్థితి

By:  Tupaki Desk   |   17 Jan 2024 4:24 AM GMT
అప్పట్లో పేపర్ బాయ్.. ఇప్పుడు ఎమ్మెల్యే.. అయినా ఇందిరమ్మ ఇంట్లోనే
X

ఎమ్మెల్యే దాకా ఎందుకు? సర్పంచ్ గా గెలిస్తేనే.. ఫార్చ్యునర్ లో తిరిగే పరిస్థితి. అందుకు భిన్నంగా అలాంటి ఆర్భాటాలు ఏమీ లేకుండా సింఫుల్ గా ఉండటం.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంట్లో ఉండటం లాంటివి ఊహించగలమా? అది కూడా తెలుగు రాష్ట్రాల్లో.. అంటే లేదనే చెబుతారు. కానీ.. అలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు ఖానాపూర్ ఎమ్మల్యే వెడ్మ బొజ్జు. తాజాగా ఆయన తన ప్రస్థానాన్ని వివరించిన తీరు చూసినప్పుడు.. ఈ రోజుల్లోనూ ఇలాంటి వారు ఉన్నారా? అన్న భావన కలుగక మానదు.

తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కావటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమన్న బొజ్జు.. తాను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఒక దినపత్రిక పేపర్ బాయ్ గా పని చేశానని చెప్పారు. తన ప్రయాణం గురించి చెబుతూ.. ''2006లో డిగ్రీ పూర్తైంది. మా తాత గేదెను అమ్మి సైకిల్ కొనిచ్చాడు. దీంతో అదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఈనాడు పేపర్ బాయ్ గా చేరాను. ఆ తర్వాత మరో పత్రికలో జర్నలిస్టుగా పని చేశాను. ఎమ్మెల్యే అయినప్పటికీ గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నా. నిరాడంబరంగా జీవిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తా' అని చెప్పుకొచ్చారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే అన్నంతనే హంగు.. అర్భాటాలకు భిన్నంగా సింఫుల్ గా ఉన్న ఖానాపూర్ ఎమ్మెల్యే తీరు ఆసక్తికరంగా మారింది. సొంత శక్తితో ఎదిగిన అతడి తీరును పలువురు అభినందిస్తున్నారు. ఏమైనా.. ఇప్పుడున్న రాజకీయాల్లోకి ఈ తరహా నేతలు పెద్ద ఎత్తున వస్తే తప్పించి.. ధనబలం నుంచి రాజకీయాలు బయటకు వచ్చే అవకాశం లేదని చెప్పాలి.