Begin typing your search above and press return to search.

జంపింగ్ ఎమ్మెల్యే మీద డౌటా...అక్కడ వైసీపీ కొత్త ముఖం...?

సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ కి 2024 ఎన్నికల్లో టికెట్ ఖాయమని మొన్నటిదాకా అనుకున్నారు. కానీ ఇపుడు సీన్ మెల్లగా మారుతోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 3:22 AM GMT
జంపింగ్ ఎమ్మెల్యే మీద డౌటా...అక్కడ వైసీపీ కొత్త ముఖం...?
X

విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ టికెట్ ఎవరికి ఇస్తారు అన్నది మరోమారు ప్రశ్నగా ముందుకు వస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ కి 2024 ఎన్నికల్లో టికెట్ ఖాయమని మొన్నటిదాకా అనుకున్నారు. కానీ ఇపుడు సీన్ మెల్లగా మారుతోంది అని అంటున్నారు.

దానికి కారణం సౌత్ లో కూడా రాజకీయం చేంజ్ అవుతోంది. అసలే టీడీపీ అక్కడ స్ట్రాంగ్ గా ఉంది. దాంతో పాటు వైసీపీలో వర్గ పోరు కొనసాగితే బంగారు పళ్లెంలో పెట్టి సీటు సమర్పించుకోవడమే అని వైసీపీ నేతలు అంటున్నారు.

వాసుపల్లి వైసీపీలోకి వచ్చినా తనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రయారిటీ ఇస్తూ మొదటి నుంచి వైసీపీలో ఉన్న వారిని సైడ్ చేస్తున్నారు అన్నది మొదటి నుంచి ఆరోపణ. వైసీపీలోకి వాసుపల్లి చేరి మూడున్నరేళ్ళు అవుతున్నా కూడా వైసీపీలో ఆయన పూర్తిగా కలసిపోలేకపోయారు అని అంటున్నారు.

దానికి కారణం ఆయన వర్గం అని పెంచి పోషించడమే అంటున్నారు. ఇక ఆయన అవకాశం వస్తే మళ్లీ పక్క చూపులు చూస్తారు అన్న అనుమానాలు కూడా వైసీపీ పెద్దలలో ఉనాయని అంటున్నారు. టీడీపీ మూడు సార్లు టికెట్ ఇస్తే ఆయన రెండు సార్లు గెలిచారు. అయినా వైసీపీలోకి వచ్చేశారు. ఇపుడు వైసీపీ నుంచి కూడా వెళ్ళరని గ్యారంటీ ఏముందని వైసీపీ నేతలు అంటున్నారు.

దాంతో విధేయతకు పెద్ద పీట వేసే వైసీపీ ఈసారి తమ వారికే టికెట్ ఇచ్చుకుంటే మేలు అని ఆలోచిస్తోంది అని అంటున్నారు. అందుకే సౌత్ నుంచి 2014లో పోటీ చేసిన కోలా గురువులుకు ఎక్కడ లేని ప్రాముఖ్యతను వైసీపీ ఇస్తోంది అని అంటున్నారు. ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవిని ఇచ్చారని, వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ చేశారని గుర్తు చేస్తున్నారు.

రేపటి రోజున ఆయనకే వైసీపీ సౌత్ అసెంబ్లీ సీటు దక్కుతుందని అంటున్నారు. కోలా గురువులు అభ్యర్ధి అయితే వైసీపీలో అన్ని వర్గాలు ఏకమై పనిచేస్తాయని అంటున్నారు. అదే విధంగా వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన వారు అంతా వాసుపల్లిని విభేదించే అని అంటున్నారు. వారు కూడా తిరిగి వచ్చే చాన్స్ ఉంది అని అంటున్నారు.

ఇక వాసుపల్లికి టికెట్ దక్కదు అనడానికి సర్వేలు కూడా కారణం అంటున్నారు. ఆయన 2009 నుంచి వరసగా పోటీ చేస్తున్నారు. రెండు సార్లు గెలిపించారు జనాలు. దాంతో ఆయన మీద యాంటీ ఇంకెంబెన్సీ ఉందని అంటున్నారు. ఆ వ్యతిరేకత వైసీపీకి కూడా తగిలి ఓటమి ఎదురు అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇలా అన్ని లెక్కలూ సరిచూసుకున్న మీదట వాసుపల్లి బదులు కోలా గురువులుకే వైసీపీ టికెట్ ఇస్తారని మాత్రం అంటున్నారు. ఇక సౌత్ లో సామాజిక సాధికార బస్సు యాత్రను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కోలా గురువులు రెడీ అవుతున్నారు. అక్కడ ఆయన తన బల ప్రదర్శన చేస్తారు అని అంటున్నారు.

ఏది ఏమైనా వైసీపీ ఉత్తరాంధ్రా ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి ఒక్క మాట చెబుతూ వస్తున్నారు. ఇంచార్జిలుగా ఉన్నంతమాత్రాన ఎవరికీ టికెట్లు కన్ ఫర్మ్ కాదు అని. చివరి నిముషం వరకూ మార్పు చేర్పులు ఉంటాయని కూడా ఆయన హింట్ ఇచ్చి వదిలారు. సో ఎవరికీ టికెట్ గ్యారంటీ అయితే లేదు. సో వాసుపల్లికి చివరి నిముషంలో ఝలక్ తప్పదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.