Begin typing your search above and press return to search.

వాని, స్వారా.. పేరు వింటేనే భయమేస్తోంది.. 4 ఏళ్ల పాపను ముసలివాడికి కట్టబెడతారా?

ప్రస్తుతం మనం ఎంత మోడర్న్‌గా బతికినా కొన్ని ఊళ్లల్లో, కొన్ని తెగల్లో మాత్రం ఇంకా పాతకాలం నాటి దారుణమైన ఆచారాలు నడుస్తున్నాయి.

By:  Tupaki Desk   |   10 April 2025 4:00 AM IST
Inside Pakistan’s Chilling Marriage Tradition
X

ప్రస్తుతం మనం ఎంత మోడర్న్‌గా బతికినా కొన్ని ఊళ్లల్లో, కొన్ని తెగల్లో మాత్రం ఇంకా పాతకాలం నాటి దారుణమైన ఆచారాలు నడుస్తున్నాయి. ఇష్టం లేకపోయినా సరే, ఆ ఊర్లో పుట్టినందుకు ఆ ఆచారాలు పాటించక తప్పదు. పాకిస్తాన్‌లోని పంజాబ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా అనే ఏరియాల్లో కొన్ని మారుమూల పల్లెల్లో 'వాని', 'స్వారా' అనే ఒక భయంకరమైన ఆచారం ఇంకా ఉంది. దీని గురించి వింటే అక్కడి ప్రజల గుండెల్లోనే కాదు.. ఇక్కడి ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.

'వాని' అంటే పష్తో భాషలో 'రక్తం' అని అర్థం. అక్కడి మీడియా దీన్ని ఒక పెద్ద సామాజిక సమస్య అంటోంది. ప్రపంచంలోని పెద్ద పెద్ద సంస్థలు ఇది మనుషుల హక్కులను తొక్కేయడమని గొడవ చేస్తున్నాయి. కానీ ఆ ఆచారం చేసేవాళ్లు మాత్రం రెండు గ్రూపుల మధ్య ఉన్న గొడవలు, పగలు పోగొట్టడానికి ఇదో మంచి పద్ధతి అని నమ్ముతున్నారు. ఈ ఆచారం ప్రకారం ఒక గ్రూపు వాళ్లు తమ కూతుర్ని రెండో గ్రూపులోని పెద్ద మనిషికి పెళ్లి కోసం ఇచ్చేస్తారు. ఆ అమ్మాయి వయసు మహా అయితే 4 నుంచి 14 ఏళ్లు ఉంటుంది. కానీ పెళ్లి చేసుకునే మొగుడి వయసు 25 నుంచి 60 ఏళ్ల వరకు ఉండొచ్చు.

ఆ ఊర్లలో రెండు తెగల మధ్య గొడవలు, కొట్లాటలు ఉంటే వాటిని ఆపడానికి ఒక తెగ వాళ్లు తమ కూతుర్ని రెండో తెగ వాళ్లకు ఇచ్చేస్తారు. హత్యలు, రేప్‌లు, అప్పులు తీర్చకపోవడం, కిడ్నాప్ చేయడం లేదా కిడ్నాప్ చేసినందుకు డబ్బులు ఇవ్వడానికి బదులుగా ఇలాంటి పనులు చేస్తారు. ఇలాంటి గొడవలను ఎదుటి గ్రూప్‌లోని వాడికి చిన్న పిల్లనిచ్చి పెళ్లి చేయడం ద్వారా సెటిల్ చేస్తారు. వాని అనేది 400 ఏళ్ల కిందట మొదలైన ఆచారం అంట. అప్పుడు మియాన్‌వాలీలోని రెండు పష్తూన్ తెగల మధ్య పెద్ద యుద్ధం జరిగిందట. అప్పటి నుంచి ఇది కొనసాగుతోంది.

4 ఏళ్ల పాపకు 60 ఏళ్ల ముసలోడితో పెళ్లి

ఈ దారుణమైన ఆచారానికి వ్యతిరేకంగా చాలా మానవ హక్కుల సంస్థలు పోరాడుతున్నాయి. పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా దీన్ని ఆపాలని చూస్తోంది. కానీ కొన్ని తెగలు మాత్రం ఇంకా ఈ పని చేస్తూనే ఉన్నాయి. ఈ ఆచారంలో 4 ఏళ్ల పసిపాపకు ఏకంగా 60 ఏళ్ల ముసలోడితో పెళ్లి చేసేస్తారు. ఇది ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించండి.