Begin typing your search above and press return to search.

వంగవీటికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన వైసీపీ...!

ఎట్టి పరిస్థితిల్లోనూ రాధాను వైసీపీలోకి తిరిగి తీసుకుని రావాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఈ విషయంలో చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 2:13 PM GMT
వంగవీటికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన వైసీపీ...!
X

వంగవీటి రాధాక్రిష్ణను వైసీపీలోకి తీసుకుని వచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీడీపీలో రాధాకు టికెట్ అన్నది లేకుండా పోయింది. ఆయన ఆశిస్తున్న విజయవాడ సెంట్రల్ సీటు బోండా ఉమాకు కేటాయించారు. అలాగే విజయవాడ తూర్పుని సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కే ఇచ్చారు ఆయన గత రెండు సార్లు నుంచి ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నారు.

విజయవాడ వెస్ట్ టికెట్ జనసేకు కేటాయించనున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు విజయవాడలో ఏ ఒక్క సీటు కూడా రాధాకు లేనట్లే. దాంతో రాధా వర్గం గరం గరం అవుతోంది. పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతున్న తమ నేతకు టీడీపీ టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది అని రాధా అనుచరులు మండిపడుతున్నారు. రాధాకు విజయవాడ సెంట్రల్ ఇస్తే కచ్చితంగా గెలిచేవారు అని అంటున్నారు.

ఒకనాటి విజయవాడ తూర్పు సీటులో భాగం అయిన సెంట్రల్ నుంచి రాధా కుటుంబం అంతా గెలిచిందని గుర్తు చేస్తున్నారు. ఇక టీడీపీ జాబితా రిలీజ్ అయిన తరువాత నుంచి రాధా వర్గం మండిపడుతోంది. సరిగ్గా ఈ పరిణామాలనే ఆసరాగా చేసుకుని వైసీపీ నేతలు రాధాకు టచ్ లోకి వెళ్లారు.

ఎట్టి పరిస్థితిల్లోనూ రాధాను వైసీపీలోకి తిరిగి తీసుకుని రావాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఈ విషయంలో చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. తాజాగా మరోసారి పేర్ని నాని కొడాలి నాని రాధాతో భేటీ అయి వైసీపీలోకి ఆహ్వానించారు అని ప్రచారం సాగుతోంది. రాధా వస్తే కనుక ఆయనకు మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని కూడా చెబుతున్నారు.

రాధా మరేమీ కోరినా వైసీపీలో తీరుస్తామని చెబుతున్నట్లుగా టాక్. వైసీపీలో చూసినా విజయవాడ సెంట్రల్ టికెట్ ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఇచ్చేశారు. ఇక విజయవాడ వెస్ట్ టికెట్ ని మైనారిటీకి ఇచ్చారు. తూర్పు టికెట్ కూడా అభ్యర్ధి ఖరారు అయ్యారు. అయితే రాధా వస్తే చివరి నిముషంలో అయినా మార్పు చేర్పులు చేసేందుకు వైసీపీ రెడీగా ఉంది అని అంటున్నారు.

వీలుంటే విజయవాడ సెంట్రల్ నుంచి కూడా రాధను పోటీకి దింపడం సాధ్యమే అని చెబుతున్నారు. ఆ మేరకు వైసీపీ అధిష్టానం నుంచి బంపర్ ఆఫర్ ఉంది అని అంటున్నారు. మరి రాధా ఏమి చేప్పారు అన్నది తెలియడంలేదు. ఎందుచేతనంటే రాధాకు గతంలో కూడా వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన ఏమీ చెప్పడంలేదు.

ఆ మధ్య వైసీపీ కీలక నేత, ఎంపీ మిధున్ రెడ్డి రాధాతో సమావేశం అయి వైసీపీలోకి ఆహ్వానించినా ఆయన నుంచి సానుకూల స్పందన రాలేదు. అయితే ఈసారి రాధాను కలసింది ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ కావడం విశేషం. పేర్ని నాని కొడాలి నాని రాధాకు శ్రేయోభిలాషులు. దాంతో వారు చెప్పినట్లుగా రాధా విని వైసీపీలోకి వస్తారా అన్న చర్చ అయితే ఉంది.

నిజానికి 2019 ఎన్నికల్లోనే రాధాకు వైసీపీ మచిలీపట్నం ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది. ఆనాడు ఆయన విజయవాడ సెంట్రల్ కోరినా ఇవ్వలేదు. దాంతోనే అలిగి ఆయన పార్టీ మారారు. మరిపుడు రాధాకు మచిలీపట్నం ఎంపీ అంటే ఓకే అంటారా లేక సెంట్రల్ సీటు ఇస్తేనే అని కండిషన్ పెడతారా అన్నది చూడాల్సి ఉంది.

ఇంకో మాట ఏంటి అంటే మచిలీపట్నంలో వల్లభనేని బాలశౌరి ఉన్నారు. ఆయన బలమైన అభ్యర్ధి, వైసీపీ నుంచి గెలిచిన ఆయన ఇపుడు జనసేనలో చేరి ఆ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను ఢీ కొట్టేందుకు వైసీపీ రాధాను దించాలని చూస్తోంది అని అంటున్నారు. ఇవన్నీ ఆలోచించుకున్న మీదటనే రాధా ఏ సంగతీ చెబుతారు అని అంటున్నారు.

ఇక్కడ మరో మాట ఉంది. రాధాకు ప్రత్యక్ష ఎన్నిలల్లో పోటీ అన్నది వైసీపీ ద్వారానే చాన్స్ ఉంది. ఆయన నో చెబితే గత పదేళ్ల నుంచి ఆయన ఎన్నికల రాజకీయాలకు దూరంగానే ఉన్నట్లుగా 2029 దాకా వేచి ఉండాల్సి వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.