Begin typing your search above and press return to search.

వైసీపీకి వంగవీటి నో చెప్పారా ?

వంగవీటి రాధా టీడీపీ నాయకుడిగా ఉంటున్నారు. ఆయన 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు.

By:  Tupaki Desk   |   4 Jun 2025 12:30 AM
వైసీపీకి వంగవీటి నో చెప్పారా ?
X

వంగవీటి రాధా టీడీపీ నాయకుడిగా ఉంటున్నారు. ఆయన 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. అయితే ఆయన గత ఆరేళ్ళుగా పార్టీలో ఉన్నా ఆయనకు ఆ పార్టీ నుంచి సరైన పదవులు దక్కలేదని అనుచరులలో ఆవేదన ఉంది అంటున్నారు. అంతే కాదు టీడీపీ కూటమి ఏడాది పాలనలో కూడా ఆయనకు న్యాయం జరగలేదని ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదని అంటున్నారు.

ఇదిలా ఉంటే మహానాడుకు వంగవీటి రాధా హాజరు కాలేదు. దాంతో ఆయనలో అసంతృప్తి పీక్స్ కి వెళ్ళిందని పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్నాయి. అవి ఏ విధంగా ప్రచారంలోకి వచ్చాయో తెలియదు కానీ వంగవీటి టీడీపీ కూటమికి గుడ్ బై అని పుకారులు షికార్లు చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో వంగవీటికి వైసీపీ టచ్ లోకి వెళ్ళిందని అంటున్నారు. ఆయనను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారని ప్రచారం సాగుతోంది. ఆయన కనుక వస్తే బాగా చూసుకుంటామని కూడా హామీ ఇచ్చారని అంటున్నారు. అయితే వంగవీటి నుంచి ఈ ప్రతిపాదనలకు సుముఖత వ్యక్తం కాలేదని అంటున్నారు. ఆయన వైసీపీలోకి తిరిగి రావడానికి ఇష్టపడలేదని ప్రచారం చేస్తున్నారు.

ఇక 2014 నుంచి 2019 మధ్యలో వంగవీటి వైసీపీలో ఉన్నారు. అయితే ఆనాటి అనుభవాలను ఆయన అనుచరులు మననం చేసుకుంటున్నారు అని అంటున్నారు. పైగా పార్టీలు తరచూ మారడం వల్ల ఇబ్బంది తప్ప రాజకీయంగా ఒరిగేది ఏమీ లేదని చెబుతున్నారు. మరో వైపు చూస్తే వంగవీటికి టీడీపీ అధినాయకత్వంలో మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. ఆయనకు యువ నేత లోకేష్ తో కూడా మంచి అనుబంధం ఉందని చెబుతున్నారు.

దాంతో పాటు టీడీపీ నుంచి బంపర్ ఆఫర్ ఒకటి వంగవీటికి రెడీగా ఉందని అంటున్నారు. అందువల్ల వంగవీటికి కాస్తా లేట్ అయినా టీడీపీలోనే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని అంటున్నారు. దాంతో ఆయన వేరే పార్టీ వైపు తొంగి చూసే చాన్స్ అసలు లేదని అంటున్నారు. అంతే కాదు ఆయన వైసీపీలోకి చేరేది ఉండదని అవన్నీ పుకార్లే అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే వంగవీటిని ఏదో విధంగా వైసీపీలోకి తీసుకుని రావాలని వైసీపీ ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదని ప్రచారం సాగుతోంది. కోస్తా జిల్లాలో బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలంటే సరైన నాయకుడు వంగవీటి అని వైసీపీ భావిస్తోంది అని అంటున్నారు. అయితే ఆయన నో చెప్పారని ప్రచారం కూడా సాగుతోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో ఏ మేరకు నిజం ఉందో ఏమిటో. ఏది ఏమైనా మళ్ళీ పుంజుకునేందుకు వైసీపీ చేస్తున్న యత్నాలు ఒక గాడిన పడడం లేదు అని అంటున్నారు.