Begin typing your search above and press return to search.

వంగవీటి రాధకు అస్వస్థత... అసలు ఏమైంది?

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధ అస్వస్థతకు లోనయ్యారు.

By:  Tupaki Desk   |   26 Sept 2024 10:39 AM IST
వంగవీటి రాధకు అస్వస్థత... అసలు ఏమైంది?
X

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధ అస్వస్థతకు లోనయ్యారు. గురువారం తెల్లవారుజామున చాతిలో స్వల్ప నొప్పితో పట్టేసినట్లు అనిపించిందని అంటున్నారు. దీంతో... కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో టెస్టులు చేసిన డాక్టర్లు రిపోర్ట్స్ అన్నీ నార్మల్ గా ఉన్నాయని తెలిపారని అంటున్నారు!

అవును... టీడీపీ నేత వంగవీటి రాధా అస్వస్థతకు లోనయ్యారు. గురువారం తెల్లవారుజామున ఛాతిలో నొప్పిగా ఉండటంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో టెస్టులు చేసిన డాక్టర్లు.. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ గానే ఉన్నాయని.. గ్యాస్ సమస్య వల్ల ఇబ్బంది పడినట్లు నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది.

ఈ విషయం తెలిసిన అనంతరం రాధ అభిమానులు భారీగా ఆస్పత్రికి వెళ్లడానికి ప్రయత్నించారని అంటున్నారు. అయితే... అభిమానులు ఎవరూ ఆదోళన చెందాల్సిన అవసరం లేదని.. ఛాతిలో స్వల్పంగా నొప్పి రావడంతోనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు! ఇదే సమయంలో... రాధా ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

మరోపక్క... వంగవీటి రాధకు ఎన్డీయే ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఎటువైపు నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ టీడీపీలోనే నిలబడ్డారనే విషయం బాబు దృష్టిలో ఉందని చెబుతున్నారు. ఎన్నికల్లో చురుకుగా ప్రచారం చేసిన ఆయనకు త్వరలో కీలక పదవి ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.