Begin typing your search above and press return to search.

ముందే పట్టాలెక్కనున్న స్లీపర్ వందే భారత్.. తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన రైలు ‘వందే భారత్’. దీన్నే ‘ట్రైన్ 18’ అని కూడా పిలుస్తుంటారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 9:21 AM GMT
ముందే పట్టాలెక్కనున్న స్లీపర్ వందే భారత్.. తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
X

మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన రైలు ‘వందే భారత్’. దీన్నే ‘ట్రైన్ 18’ అని కూడా పిలుస్తుంటారు. కేవలం 18 నెలల్లో దీని డిజైన్ మ్యానిఫ్యాక్చరింగ్ పూర్తయినందును ఈ పేరుతో కూడా పిలుస్తారు. ఈ రైలు వేగం, సమయంతో పాటు సౌకర్యవంతంగా ఉండడంతో ఎక్కువ మంది ప్రయాణికులు ఇందులోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రైల్వే శాఖ ఇప్పుడు స్లీపర్ క్లాసులను ప్రవేశపెట్టబోతోంది.

సరికొత్త డిజైన్.. సకల సదుపాయాలు

‘వందే భారత్’లో త్వరలోనే కొత్త అందాలు సంతరించుకోనున్నాయి. ఇందులో భాగంగా డిజైన్లను మారుస్తున్నారు. అన్ని సదుపాయాలతో సిద్ధం చేస్తున్నారు. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ కు సంబంధించి స్లీపర్ రైళ్లు ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తున్నది. వీటిని విజయవాడ డివిజన్ కు రెండింటిని కేటాయించే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్-విశాఖపట్నం, విజయవాడ-చెన్నై మధ్య నడిచే సెంట్రల్ రైళ్లకు ఎక్కువగా గిరాకీ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వందేభారత్ కు మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే వీటిని ప్రవేశపెట్టేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఇందుకు డివిజన్ వ్యాప్తంగా ఇప్పటికే పట్టాల పటిష్టతను పెంచారు. సాధారణ రైళ్లు రద్దు చేసి నిర్వహణ పనులు చేపడుతున్నారు. త్వరలోనే రైళ్ల ట్రయల్ నిర్వహించనున్నారు.

దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా..

వందే భారత్ స్లీపర్ రైళ్లలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత రైళ్లు దివ్యాంగులకు అనుకూలంగా లేకపోవడంతో వారు ప్రయాణం చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీన్ని దృస్టిలో ఉంచుకొని వందే భారత్ స్లీపర్ రైళ్ల బోగీల్లో ప్రత్యేక డిజైన్ తో తయారు చేశారు. ఇందులో ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేశారు. వీటితో ప్రయాణికులపై బెర్తులకు సులువుగా వెళ్లే అవకాశం ఉంది.

ఎలా మార్చారంటే..

వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఏర్పాటు చేయనున్న బోగీల్లో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 857 బెర్తుల్లో 37 సిబ్బందికి, ఒక ప్యాంట్రీకార్ ఉంటాయి. బెర్తులు మరింత వెడల్పుగా ఉండేలా డిజైన్ మార్చారు. ప్రతి బోగీలో 3 టాయిలెట్స్ ఉండేలా డిజైన్ చేశారు. ఇవి ఇప్పుడున్న వందే భారత్ తో పోల్చుకుంటే మరింత మారుతుంది. వీటికి సంబంధించిన ఫొటోలను రైల్వే శాఖ మినిస్టర్ అశ్విన్ శ్రీ వైష్ణవ్ గతంలోనే ఎక్స్ (ట్విటర్) ద్వారా పంచుకున్నారు. అయితే ఈ రైళ్లు మాత్రం మరింత వేగంగా మన ముందుకు వచ్చే అవకాశం ఉంది.