Begin typing your search above and press return to search.

వందే భారత్ స్లీపర్ రైళ్లు ఎలా ఉండబోతున్నాయంటే...?

దేశంలోని వందేభారత్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ వెలువడింది. వచ్చే ఏడాది వందే భారత్ స్లీపర్ కోచ్‌ ను అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ రల్వేస్ నిర్ణయించింది

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:22 AM GMT
వందే భారత్ స్లీపర్ రైళ్లు ఎలా ఉండబోతున్నాయంటే...?
X

దేశంలోని వందేభారత్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ వెలువడింది. వచ్చే ఏడాది వందే భారత్ స్లీపర్ కోచ్‌ ను అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ రల్వేస్ నిర్ణయించింది. రాత్రిపూట ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనువుగా 2024వ సంవత్సరంలో హైస్పీడ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు భారతీయ రైల్వే రానునాయి. అంటే... ఇప్పటివరకు ఛైర్ కార్ ప్రయాణాలకే పరిమితమైన వందేభారత్ రైళ్లు ఇక స్లీపర్ రైళ్లుగా మారనున్నాయన్న మాట. ఈ సమయంలో వీటికి సంబంధించిన డిజైన్లు విడుదలయ్యాయి.

అవును... దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 33 వందేభారత్ రళ్లు పట్టాలెక్కి వేర్వేరు రాష్ట్రాలు, నగరాల మధ్య పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. వీటికి ప్రజల్లో బాగా ఆధరణ వచ్చింది. టిక్కెట్ ధర కాస్త ఎక్కువైనా... వేగంగా గమ్యస్థానాలను చేరడానికి ప్రయాణికులు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో 2024 ఫిబ్రవరి నాటికి స్లీపర్ వందే భారత్ రైళ్లు సైతం పట్టాలపై పరుగులు పెట్టనున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ వందే భారత్ స్లీపర్ కోచ్‌ లు ఎలా ఉంటాయనే విషయం రివీల్ చేసింది. వీటికి సంబంధించిన డిజైన్లను విడుదల చేసింది. ఇందులో భాగంగా... వందేభారత్ స్లీపర్ కోచ్ లో మొత్తంగా 857 బెర్తులు ఉండబోతోన్నాయని తెలుస్తుంది. అయితే వీటిలో 823 బెర్తుల్లో మాత్రమే ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోవచ్చు. మిగిలిన బెర్తులను డ్యూటీలో ఉండే స్టాఫ్ కు కేటాయిస్తారు.

అయితే సాధారణ రైళ్లలో ఉన్నట్లుగా ఒక్కో కోచ్ లో నాలుగు టాయిలెట్లు ఉండవు. వందేభారత్ స్లీపర్ కోచ్ లలో నాలుగుకు బదులుగా మూడు టాయిలెట్లు మాత్రమే ఉంటాయి. వీతితో పాటు ఓ మినీ ప్యాంట్రీ ఉంటుంది. ఇదే సమయంలో దివ్యాంగులకు కంఫర్ట్ గా ఉండేవిధంగా ర్యాంప్‌ ను సైతం అందుబాటులోకి తీసుకుని వచ్చేలా డిజైన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్లీపర్ రైళ్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మాణంలో ఉన్నాయి.

14 నిమిషాల అద్భుతం:

ఇదే సమయంలో కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ-హైస్పీడ్ రైలు వందేభారత్‌ విషయంలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. వందేభారత్ రైళ్లను కేవలం 14 నిమిషాల్లోనే శుభ్రం చేసి, నెక్స్ట్ జర్నీకి సిద్ధం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. "14 నిమిషాల అద్భుతం" పేరుతో దీన్ని ప్రారంభించారు.

ప్రస్తుతం వందే భారత్ రైలును శుభ్రం చేయడానికి దాదాపు 45 నిమిషాలు పడుతుంది. అయితే జపాన్‌ లోని టోక్యో, ఒసాకా వంటి స్టేషన్లలో రైళ్లను కేవలం ఏడు నిమిషాల్లోనే శుభ్రం చేస్తుంటారు. దీంతో వీటిని ఇన్స్ పిరేషన్ గా తీసుకున్న ఇండియన్ రైల్వేస్ "14 నిమిషాల అద్భుతం" కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీనికోసం ఒక్కో కోచ్‌కు ముగ్గురు క్లీనింగ్ సిబ్బంది పని చేస్తారు.