Begin typing your search above and press return to search.

వందే భారత్ ట్రైన్లను అప్ గ్రేడ్ చేశారా? కొత్త మార్పులు ఇవేనట!

మోడీ సర్కారు అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లను అంతకంతకూ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Sep 2023 4:22 AM GMT
వందే భారత్ ట్రైన్లను అప్ గ్రేడ్ చేశారా? కొత్త మార్పులు ఇవేనట!
X

మోడీ సర్కారు అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లను అంతకంతకూ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారాంతంలో మరో 9 కొత్త వందే భారత్ సర్వీసుల్ని దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ తొమ్మిది రైళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు. ఇదిలా ఉంటే.. మొదట తయారు చేసిన వందేభారత్ రైళ్లలో ప్రయాణికుల నుంచి ఫీడ బ్యాక్ తీసుకున్న రైల్వే శాఖ.. తాజాగా తెస్తున్న వందే భారత్ రైళ్లలో కొన్ని సౌకర్యాల విషయంలో మరింత మెరుగుపర్చిన విషయం తాజాగా బయటకు వచ్చింది.

గరిష్ఠంగా తొమ్మిది నుంచి పది గంటల వరకు వందే భారత్ ప్రయణం సాగుతుంది. ఇంత సేపు కూర్చొని ప్రయాణం చేయటం పెద్ద వయస్కులకు కష్టంగా మారింది. దీంతో.. ఈ రైళ్లలో ప్రయాణించే వారు మరింత సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు వీలుగా మొత్తం 25 మార్పులు చేయటం గమనార్హం. గంటల తరబడి సాగే ప్రయాణంలో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా మార్పులు చేశారు.

ప్రయాణికులు మరింత వెక్కి వాలి నిద్ర పోయేందుకు వీలుగా ఫుష్ బ్యాక్ ను పెంచటం కొత్త రైళ్లలో కనిపించనుంది. అంతేకాదు.. సీట్ల మెత్తదనాన్ని పెంచారు. మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ను.. ఫుట్ రెస్ట్ ను మెరుగుపర్చారు. బాత్రూంలో మరింత వెలుతురు ఉండేలా మార్పులు చేయటంతో పాటు.. వాష్ బేసిన్ల లోతును సైతం పెంచుతూ మార్పులు చేశారు. ఏసీ చల్లదనాన్ని పెంచేలా ప్యానెళ్లలో మార్పులు చేశారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కలిగేలా తాజా మార్పులు ఉన్నట్లుగా చెబుతున్నారు. సో.. కొత్త వందే భారత్ రైళ్లు మరింత లగ్జరీగా ఉండనున్నాయన్న మాట.