Begin typing your search above and press return to search.

11 వందే భారత్ ఛైర్ కార్ ట్రైన్ల ఉత్పత్తి తర్వాత ఆపేస్తున్నారా?

ఇదిలా ఉండగా.. ఇప్పుడున్న వందే భారత్ ఛెయిర్ కార్ ట్రైన్లకు మరో 11 రైళ్లను ఉత్పత్తి చేసిన తర్వాత.. వీటి తయారీని నిలిపివేయనున్న విషయం తాజాగా వెలుగు చూసింది.

By:  Tupaki Desk   |   9 Jun 2025 10:26 AM IST
11 వందే భారత్ ఛైర్ కార్ ట్రైన్ల ఉత్పత్తి తర్వాత ఆపేస్తున్నారా?
X

రైల్వేలకు సంబంధించి నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చిన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంలో వందే భారత్ ట్రైన్లను చెప్పొచ్చు. ఇప్పుడున్న రైళ్లలో అత్యధిక వేగంగా పరుగులు తీస్తాయని చెప్పే ఈ రైళ్లు.. సామాన్యులు.. దిగువ మధ్యతరగతి వారికి ఏ మాత్రం అందుబాటులో ఉండేవి కావన్న విషయం తెలిసిందే. సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ ట్రైన్ టికెట్ ధరలు ఎక్కువన్న సంగతి తెలిసిందే. వందేభారత్ సిరీస్ లో ఇప్పటివరకు చెయిర్ కార్ ట్రైన్లను తీసుకొచ్చారు. స్లీపర్ కోచ్ ట్రైన్లను తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్లాన్ చేయటం.. వాటిని 2024 ఎన్నికలకు ముందు లాంఛ్ చేయాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడున్న వందే భారత్ ఛెయిర్ కార్ ట్రైన్లకు మరో 11 రైళ్లను ఉత్పత్తి చేసిన తర్వాత.. వీటి తయారీని నిలిపివేయనున్న విషయం తాజాగా వెలుగు చూసింది. దీనికి కారణం.. వందేభారత్ స్లీపర్ కోచ్ ట్రైన్ల ఉత్పత్తి మీద ఫోకస్ పెట్టటమే. ముందుగా అనుకున్న దాని ప్రకారం వందేభారత్ ఛెయిర్ కార్ ట్రైన్లకు సంబంధించి మొత్తం 97 రైళ్ల తయారీకి చెన్నలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి ఆర్డర్ ఇచ్చారు.

ఇప్పటివరకు 97 వందేభారత్ ఛెయిర్ కార్లకు 86 రైళ్ల తయారీ పూర్తి కావటం.. రైల్వేలకు డెలివరీ చేయటం జరిగిపోయింది. ఇప్పుడు మరో 11 రైళ్లను తయారు చేస్తే కాంటాక్టు పూర్తి అవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వీటి ఉత్పత్తి పూర్తి కానుంది. ఆ తర్వాత నుంచి వందే భారత్ స్లీపర్ ట్రైన్ల తయారీ మీద ఫోకస్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఛెయిర్ కార్ ట్రైన్ల ఉత్పత్తి ఆపేస్తారు. అంటే.. రానున్న రోజుల్లో వందే భారత్ స్లీపర్ కోచ్ ట్రైన్లు పట్టాల మీదకు పెద్ద ఎత్తున రానున్నాయన్న మాట.