వందే భారత్, శతాబ్ది రైళ్ల అసలు యజమాని ఎవరు?
ఇప్పుడు శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్ గురించి మాట్లాడుకుంటే.. ఈ రెండు రైళ్లు కూడా భారతీయ రైల్వేనే నడిపిస్తుంది.
By: Tupaki Desk | 27 April 2025 9:00 PM ISTభారతీయ రైల్వే గత కొన్నేళ్లుగా తన సేవలను ఆధునీకీకరిస్తుంది. అలాగే రైళ్ల వేగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. వాటిలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి హై-స్పీడ్, ప్రీమియం రైళ్లు ముఖ్యమైనవి. అయితే ఈ రైళ్ల అసలు యజమాని ఎవరో తెలుసా.. ఇవి ఏదైనా ప్రైవేట్ కంపెనీకి చెందినవా లేక ప్రభుత్వానివేనా అనే విషయాన్ని ఈ వార్తలో తెలుసుకుందాం.
వందే భారత్ అసలు యజమాని ఎవరు?
వందే భారత్ రైలు దీనిని గతంలో ట్రైన్ 18 అని కూడా పిలిచేవారు. పూర్తిగా భారతదేశంలోనే తయారు చేశారు. దీనిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) తయారు చేసింది. ఈ రైలు "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం కింద నిర్మించారు. దీని యాజమాన్యం పూర్తిగా భారతీయ రైల్వేకి చెందినది. అంటే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వే ఆస్తి, దీనిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది.
శతాబ్ది యజమాని ఎవరు?
ఇప్పుడు శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్ గురించి మాట్లాడుకుంటే.. ఈ రెండు రైళ్లు కూడా భారతీయ రైల్వేనే నడిపిస్తుంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను మొదటిసారిగా 1988లో ప్రారంభించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను 1969లో ప్రారంభించారు. ఈ రెండు రైళ్ల లక్ష్యం ఒకటే. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం. వీటి మెయింటెనెన్స్ పూర్తిగా భారతీయ రైల్వే ఆధీనంలోనే ఉన్నాయి.
చాలా మంది ఈ ప్రీమియం రైళ్లను ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తుందని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వందే భారత్, శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్ అన్నీ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి. వీటి టికెట్ బుకింగ్, మెయింటెనెన్స్, ఆపరేషన్, డెవలప్ మెంట్ కు సంబంధించిన అన్ని పనులు భారతీయ రైల్వే వివిధ విభాగాల ద్వారా నిర్వహిస్తారు.
ఈ రైళ్లు వారి ఆస్తి
భవిష్యత్తులో భారతీయ రైల్వే కొన్ని రైళ్ల మెయింటెనెన్స్ ప్రైవేట్ వారికి అప్పగించే అవకాశం లేకపోలేదు. కానీ ప్రస్తుతానికి వందే భారత్, రాజధాని,శతాబ్ది వంటి ప్రధాన రైళ్లు భారతీయ రైల్వేకు చెందినవి. ప్రభుత్వ ఆస్తులుగా దేశ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.
