తిరుపతి వెళ్లే వందేభారత్ లో వడ్డించిన సాంబార్ లో బొద్దింక
భారత రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న రైల్ సర్వీసుల్లో ప్రీమియం రైలుగా పేర్కొనే వందేభారత్ కు సంబంధించిన నిర్వహణ మీద ఆరోపణలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 1 May 2025 9:32 AM ISTభారత రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న రైల్ సర్వీసుల్లో ప్రీమియం రైలుగా పేర్కొనే వందేభారత్ కు సంబంధించిన నిర్వహణ మీద ఆరోపణలు వస్తున్నాయి. అన్నింటికి మించి.. ఈ రైలులో వడ్డించే ఫుడ్ మీద ఇప్పటికే బోలెడన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తిరుపతి - సికింద్రబాద్ వందేభారత్ రైలులో నాణ్యత లేని ఆహారాన్ని సర్వ్ చేశారంటూ ఫిర్యాదు తెర మీదకు వచ్చింది.
ప్రయాణ టికెట్ తో పాటు ట్రైన్ లో సర్వ్ చేసే ఆహరానికి అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే. అలా చేసిన తర్వాత కూడా ప్రయాణికులకు వడ్డించే ఫుడ్ క్వాలిటీ మీద జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అయితే.. అందుకు భిన్నంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలు ఉన్నాయి. తాజాగా వందేభారత్ రైల్లో ప్రయాణించిన ప్రయాణికుడికి వడ్డించిన సాంబార్ లో పురుగులు ఉండటం కలకలాన్ని రేపింది.
దీంతో.. సదరు ప్రయాణికుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో.. సదరు ప్రయాణికుడికి భోజనానికి బదులుగా ఇన్ స్టంట్ నూడుల్స్ ను ఇచ్చి సరిపెట్టారు. అంతేకాదు.. నాణ్యత లేని ఆహారాన్ని అందించిన వైనంపై లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. వందే భారత్ లాంటి ప్రీమియం రైళ్లలో అందించే సేవల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్న మాట బలంగా వినిపిస్తోంది. పురుగులున్న సాంబార్ ను సర్వ్ చేసిన సంస్థ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
