Begin typing your search above and press return to search.

ఇండియన్ 'టైగర్ మ్యాన్' మృతి.. ఎవరీ వాల్మిక్ థాపర్?

భారతదేశపు ప్రఖ్యాత పరిరక్షకుడు, దేశంలో "టైగర్ మ్యాన్"గా విస్తృతంగా ప్రసిద్ధి చెందిన వాల్మీక్ థాపర్.. శనివారం ఉదయం ఢిల్లీలోని కౌటిల్య మార్గ్ లో గల తన నివాసంలో కన్నుమూశారు.

By:  Tupaki Desk   |   31 May 2025 5:00 PM IST
ఇండియన్ టైగర్ మ్యాన్ మృతి.. ఎవరీ వాల్మిక్ థాపర్?
X

భారతదేశపు ప్రఖ్యాత పరిరక్షకుడు, దేశంలో "టైగర్ మ్యాన్"గా విస్తృతంగా ప్రసిద్ధి చెందిన వాల్మీక్ థాపర్.. శనివారం ఉదయం ఢిల్లీలోని కౌటిల్య మార్గ్ లో గల తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన 73 ఏళ్ల వయసులో నేడు తుదిశ్వాస విడిచారు. తన జీవితంలో నాలుగు దశాబ్ధాలకు పైగా వన్యప్రాణుల సంరక్షణకు అంకితం చేశారు.

అవును... భారతదేశ పరిరక్షణ రంగంలో మహోన్నత వ్యక్తి అయిన వాల్మిక్ థాపర్.. తన జీవితంలో నాలుగు దశాబ్ధాలకు పైగా వన్యప్రాణుల సంరక్షణకు అంకితం చేయగా.. ప్రధానంగా ప్రత్యేక దృష్టిని పులుల సంరక్షణపై ఉంచారు. దీనికోసం ఆయన 1988లో రణథంబోర్ ఫౌండేషన్ అనే ఎన్.జీ.ఓ కు కో-ఫౌండర్ గా ఉన్నారు.

ఈయన బలమైన వేట నిరోధక చట్టాలకు, పులుల నివాస స్థలాల పరిరక్షణకు బలమైన మద్దతుదారుగా ఉన్నారు. ప్రధానంగా మానవ జోక్యం లేని ప్రాంతాలను పులుల కోసం ప్రత్యేకంగా ఉంచాలని ఆయన నిత్యం కోరుకునేవారు. ఈ సందర్భంగా ఆయన మృతికి కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ సంతాపం వ్యక్తం చేశారు.

గత నాలుగు దశాబ్ధాలుగా.. ముఖ్యంగా పులుల పరిరక్షణలో దిగ్గజం అయిన వాల్మిక్ థాపర్ ఇప్పుడు మన మధ్య లేరని.. ఇది చాలా పెద్ద నష్టం అని.. నేటి రణతంబొర్ ఆయన అంకితభావంతో కూడిన కృషి, అవిశ్రాంత ఉత్సాహానికి నిదర్శనమని అన్నారు.

ఎవరీ థాపర్?:

థాపర్ రండ్రి రమేష్ థాపర్ ఒక ప్రసిద్ధ జర్నలిస్ట్ కాగా.. అతని అత్త చరిత్రకారిణి రోమిలా థాపర్. ఇక.. నటుడు శశికపూర్ కుమార్తె, థియేటర్ ఆర్టిస్ట్ సంజన కపూర్ ను థాపర్ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు.

థాపర్ సుమారు 150కి పైగా ప్రభుత్వ ప్యానెల్స్, టాస్ ఫోర్సులలో పనిచేశారు. వాటిలో ప్రధానమంత్రి నేతృత్వంలోని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ కూడా ఉంది. 2005లో సరిస్కా టైగర్ రిజర్వ్ నుంచి పులులు అదృశ్యమైన సమయంలో ఆయనను యూపీఏ ప్రభుత్వం టైగర్ టాస్క్ ఫోర్స్ కు నియమించింది.

ఇదే సమయంలో... థాపర్ వన్యప్రాణులపై సుమారు 30కి పైగా పుస్తకాలు రచించారు! వాటిలో ల్యాండ్ ఆఫ్ ది టైంగర్: ఎ నేచురల్ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ (1997), టైగర్ ఫైర్: 500 ఇయర్స్ ఆఫ్ ది టైగర్ ఇన్ ఇండియా అనే పుస్తకాలు ప్రశంసలు పొందాయి.

ఇదే క్రమంలో.. అతను డాక్యుమెంటరీల ద్వారా భారత వన్యప్రాణులను అంతర్జాతీయ తెరపైకి తీసుకొచ్చారు. 2024లో రణతంబోర్ లో అడవి పులులను పరిశీలించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా "మై టైగర్ ఫ్యామిలీ" అనే డాక్యుమెంటరీలో కనిపించారు. ఆయనను భారత పులుల స్వరంగా పలువురు అభివర్ణిస్తారు.