Begin typing your search above and press return to search.

పార్టీకి పిలిచిన ఆ అమ్మాయికి 14 ఏళ్లు నరకం చూపించాడు

ఇంట్లోకి వెళ్లిన ఆమెను బయట కు రాకుండా బంధించేశాడు. ఆమె చేత పనులు చేయించేవాడు. చిన్న విషయాల కు దారుణంగా కొట్టేవాడు.

By:  Tupaki Desk   |   3 Aug 2023 4:46 AM GMT
పార్టీకి పిలిచిన ఆ అమ్మాయికి 14 ఏళ్లు నరకం చూపించాడు
X

విన్నంతనే వణుకు పుట్టేలా ఉన్న ఈ ఉదంతం గురించి తెలిసినంతనే.. ఇంత దుర్మార్గానికి కారణమైన వ్యక్తిని ఏం చేసినా తక్కువే అన్న భావన కలుగక మానదు. అమానవీయమైన రీతి లో వ్యవహరించిన ఈ వ్యక్తి పైశాచికత్వాన్ని పద్నాలుగేల్లు భరించిన ఆ బాధితురాలి గురించి ఆలోచన వచ్చినంతనే అయ్యో అనిపించకమానదు. పార్టీకి పిలిస్తే వెళ్లిన పాపానికి.. పద్నాలుగేళ్లుగా నరకాన్ని చవి చూసిన ఈ ఉదంతంలోకి వెళితే.

రష్యాలోని చెల్యాబిన్స్క్ కు చెందిన వ్లాదిమిర్ చెస్కిడోవ్ అనే వ్యక్తి బాధితురాలి ని మందు పార్టీకి పిలిచాడు. దీంతో.. ఆమె అతడి ఇంటికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లిన ఆమెను బయట కు రాకుండా బంధించేశాడు. ఆమె చేత పనులు చేయించేవాడు. చిన్న విషయాల కు దారుణంగా కొట్టేవాడు. హింస కు గురి చేసేవాడు. కొద్దిరోజుల తర్వాత మరో మహిళను అతడు తీసుకురావటం.. ఆమెతో జరిగిన గొడవ లో ఆమెను దారుణంగా చంపేశాడు.

ఇలా ఏళ్లకు ఏళ్లు ఇంట్లో నుంచి బయట కు రానివ్వకుండా బాధితురాలిని బంధించిన ఆ దుర్మార్గుడి ఆరోగ్యం ఇటీవల దెబ్బతింది. దీంతో.. సదరు యువతి తన తల్లి సాయాన్ని తీసుకొని.. చెర నుంచి బయట కు వచ్చింది. ఆ వెంటనే బాధితురాలు పోలీసుల కు ఫిర్యాదు చేయటంతో అతడింట్లో సోదాలు నిర్వహించారు.

ఇంట్లో పూడ్చిన మానవ శరీర అవశేషాల్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి మీద అత్యాచారం.. హత్య.. కిడ్నాప్ లాంటి సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆ రాక్షసుడ్ని.. ఆరోగ్యం బాగైనంతనే అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు.