Begin typing your search above and press return to search.

పాక్ లో పండ్ల ధరలు ఇంత భారీనా? మన రూపాయిల్లో చూస్తే?

ప్రస్తుతం ఉన్న కరెన్సీ మారకం ధరల్ని చూస్తే.. ఒక భారత రూపాయి పాక్ కరెన్సీ అయిన రూపాయి లెక్కల్లోకి చూస్తే రూ.3.07 నుంచి 3.19 మధ్య ఉంటుంది.

By:  Garuda Media   |   26 Feb 2026 2:00 PM IST
పాక్ లో పండ్ల ధరలు ఇంత భారీనా? మన రూపాయిల్లో చూస్తే?
X

మన దేశానికి చెందిన వాగ్లర్ ఒకరు పాకిస్థాన్ లోని పండ్ల ధరల మీద చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అక్కడి పండ్ల ధరల్ని అడిగి తెలుసుకున్న వీడియోను అతను పోస్టు చేశాడు. ఇందులో కేజీ అరటిపండ్లు రూ.300గా ఉంటే.. బొప్పాయి అయితే కేజీ ధర రూ.400గా పేర్కొన్నారు. ఇలా పాకిస్థాన్ లో పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశంలోని పండ్ల ధరలతో పోలిస్తే.. మన దేశంలో చాలా చౌకగా ఉందన్న మాట వినిపిస్తోంది.

అయితే.. ఇక్కడో విషయాన్ని మిస్ కాకూడదు. పాక్ లోని పండ్ల ధరల్ని ఆ దేశ వ్యాపారిని అడిగిన తెలుసుకొని.. పాకిస్థాన కరెన్సీలో చెప్పారు. మరి.. భారతీయ కరెన్సీలో దాన్ని కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందన్నది ఆసక్తికర అంశంగా చెప్పాలి. దానికి ముందు పాక్ రూపాయి మన భారత రూపాయితో మారకం చేసినప్పుడు ఎంత తేడా ఉందన్నది అర్థమైతే..మిగిలిన లెక్కల్ని తేలిగ్గా కట్టేయొచ్చు.

ప్రస్తుతం ఉన్న కరెన్సీ మారకం ధరల్ని చూస్తే.. ఒక భారత రూపాయి పాక్ కరెన్సీ అయిన రూపాయి లెక్కల్లోకి చూస్తే రూ.3.07 నుంచి 3.19 మధ్య ఉంటుంది. లెక్కలు మరింత తేలిగ్గా అర్థమయ్యేందుకు మన రూపాయి.. పాక్ కరెన్సీ మూడు రూపాయిలకు సమానంగా చెప్పాలి. అంటే.. పాక్ 30 రూపాయిలు భారత రూపాయిల్లో చెప్పాలంటే రూ.10 మాత్రమే. ఈ లెక్కన చూసినప్పుడు అరటిపండ్లు భారత కరెన్సీ ప్రకారం చూస్తే కేజీ 100గా,, బొప్పాయి రూ.130గా అర్థమవుతుంది.

అరటి పండు ధరల్ని చూస్తే.. మన కంటే సరాసరిగా డబుల్ ధరలు ఉన్నాయని చెప్పొచ్చు. మన దేశంలో కేజీ అరటి రూ.35 నుంచి రూ.50 మధ్యలో ఉన్న విషయం తెలిసిందే. ఇక.. బొప్పాయి విషయానికి వస్తే.. పాక్ లోని ధరల్ని భారత రూపాయిల్లోకి మారిస్తే కేజీ రూ.133గా చెప్పాలి.భారత్ లో కేజీ బొప్పాయి రూ.30-50 మధ్యలో ఉండటం తెలిసిందే.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. భారత్ లో కేజీ యాపిల్ రూ.350-500 వరకు ఉంటే.. పాకిస్తాన్ లో మాత్రం కేవలం రూ.500మాత్రమే. అదే మన రూపాయిల్లో లెక్కేస్తే రూ.170 కంటే తక్కువగా చెప్పాలి. అదే ఖర్జురాల ధరలు పాక్ లో కేజీ 1200 పాకిస్థానీ రూపాయిలుగా చెప్పొచ్చు. అంటే.. కేజీ రూ.400. యాపిల్ ధరలు మన కంటే తక్కువగా ఉంటే.. ఖర్జురాల ధరలు కూడా మన ధరలకు దగ్గర దగ్గరగా ఉన్నట్లు చెప్పాలి.