Begin typing your search above and press return to search.

సొరంగంలో కూలీల లేటెస్ట్ అప్ డేట్ ఇదే... 9 రోజుల తర్వాత తొలిసారి...!

ఉత్తరాఖండ్‌ లోని సిల్క్యారా సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కూలీలను రక్షించేందుకు సుమారు గత పది రోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Nov 2023 5:08 AM GMT
సొరంగంలో కూలీల లేటెస్ట్  అప్  డేట్  ఇదే... 9 రోజుల తర్వాత తొలిసారి...!
X

ఉత్తరాఖండ్‌ లోని సిల్క్యారా సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కూలీలను రక్షించేందుకు సుమారు గత పది రోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కోసం ప్రత్యేకంగా పరికరాలను విదేశాల నుంచి తెప్పిస్తున్నారు. జెనీవా కేంద్రంగా ఉన్న "అంతర్జాతీయ సొరంగాలు, భూగర్భ తవ్వకాల సంఘం" అధిపతి ఆర్నాల్డ్‌ డిక్స్‌ తాజాగా సిల్క్యారా సొరంగం వద్దకు చేరుకుని సహాయక చర్యల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసక్తికర అప్ డేట్ తెరపైకి వచ్చింది.

అవును... గత ఆదివారం నుంచి ఇప్పటివరకు నాలుగు అంగుళాల గొట్టం ద్వారా డ్రైఫ్రూట్స్, ఔషధాలు, ఆక్సిజన్‌ వంటివి మాత్రమే పంపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. ఇందులో భాగంగా... ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టాన్ని సొరంగ శిథిలాల ద్వారా లోపలకు పంపించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో సుమారు 9రోజుల తర్వాత లోపలున్న 41మంది కూలీలకు వేడి వేడి ఆహారం అందజేశారు.

ఇందులో భాగంగా వేడి వేడి రోటీలు, కూరలు, కిచిడీ, పండ్లు, మొబైళ్లు, ఛార్జర్లు వంటివి బాటిళ్లలో నింపి కూలీల వద్దకు చేర్చినట్టు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో కూలీలు ఉన్నచోట దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేందుకు ఎండోస్కోపీ తరహా కెమెరాను ఉపయోగించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఫలితంగా... వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుందని అన్నారు.

ఇక లోపల చిక్కుకున్న కార్మికులకు వంటచేసే హేమంత్ అనే వ్యక్తి తాజా ఈ విషయంపై స్పందించారు. ఇందులో భాగంగా సుమారు తొమ్మిది రోజుల తర్వాత మొట్ట మొదటిసారి వారికి వేడి ఆహారం పంపినట్లు చెప్పారు. ఇదే సమయంలో... ప్రత్యామ్నాయ మార్గంలో ఆహారం, మొబైల్ ఫోన్స్, ఛార్జర్లను లోపలికి పంపినట్టు రెస్క్యూ ఆపరేషన్ ఇంఛార్జి కల్నల్ దీపక్ పాటిల్ వెల్లడించారు.

ఇదే విషయంపై నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ (ఎన్.హెచ్.ఐ.డి.సీ.ఎల్) అన్షు మనీశ్ ఖుల్కో స్పందించారు. ఇందులో భాగంగా... ఈ అప్ డేట్ గురించి తెలియగానే చిక్కుకున్న కూలీల్లో ఆనందం నెలకుందని తెలిపారు. ఇదే సమయంలో మొదట్లో మొదటి లైఫ్‌ లైన్‌ ను మూసివేస్తే ఏమి జరుగుతుందనే సందేహం ఉండేది కానీ... ఇప్పుడు ప్రత్యామ్నాయ లైఫ్‌ లైన్‌ ను కూడ్దా ఏర్పాటు చేసామని అన్నారు.

మరోపక్క సొరంగంలో చిక్కుకుపోయిన కూలీల స్థైర్యం ఏమాత్రం సడలిపోకుండా చూడాలని ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీకి ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. తాజాగా ఆయనతో ఫోన్లో మాట్లాడిన మోడీ... సొరంగం నుంచి వారిని వెలుపలకు తీసుకువచ్చేందుకు అన్ని వనరులను కేంద్రం సమకూరుస్తోందని, కూలీలంతా త్వరలోనే క్షేమంగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.