Begin typing your search above and press return to search.

రిజిస్ట్రేష‌న్ లేని 'స‌హ‌జీవ‌నం' క్రిమిన‌ల్ నేరం: ఉత్త‌రాఖండ్‌లో 'యూసీసీ'!

అయితే.. తాజాగా ఉత్త‌రాఖండ్ తీసుకురానున్న యూసీసీలో ఏమున్నాయ‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. సుప్రీంకోర్టు స‌మ‌ర్థించిన స‌హ‌జీవ‌నం అంశాన్ని.. ఈ బిల్లులోనూ పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   6 Feb 2024 4:30 PM GMT
రిజిస్ట్రేష‌న్ లేని స‌హ‌జీవ‌నం క్రిమిన‌ల్ నేరం:  ఉత్త‌రాఖండ్‌లో యూసీసీ!
X

దేవ భూమి, బీజేపీ పాలిత ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం యూనిఫాం సివిల్ కోడ్‌(యూసీసీ)(ఉమ్మ‌డి పౌర స్మృతి)ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ముసాయిదా బిల్లుకు ఇక్క‌డి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే.. దీనిని ప్ర‌స్తుతం జ‌రుగుతున్న బ‌డ్జెట్ స‌మావేశాల్లో పెట్టి ఆమోదించుకునేం దుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. విప‌క్షాలు వ‌ద్ద‌ని, అధ్య‌య‌నం చేయాల‌ని చెబుతున్నాయి. ఏదేమైనా దీనిపై త్వ‌ర‌లోనే గ‌వ‌ర్న‌ర్ ఆమోదం ల‌భించే అవ‌కాశం ఉంది.

అయితే.. తాజాగా ఉత్త‌రాఖండ్ తీసుకురానున్న యూసీసీలో ఏమున్నాయ‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. సుప్రీంకోర్టు స‌మ‌ర్థించిన స‌హ‌జీవ‌నం అంశాన్ని.. ఈ బిల్లులోనూ పేర్కొన్నారు. అయితే, దీనికి కొన్ని నిబంధ‌న‌లు విధించారు. స‌హ‌జీవ‌నంలో ఉన్న‌వారు.. గ‌తంలో పెళ్లి చేసుకుని ఉండ‌కూడ‌దు.

అదేవిధం గా ఒక‌రితో స‌హ‌జీవ‌నం చేస్తూ.. మ‌రొక‌రితో క‌లిసి ఉండ‌కూడ‌దు. పైగా.. వీరు రిజిస్ట్రేష‌న్ చేయాల్సి ఉంటుంది. లేక‌పోతే.. క్రిమిన‌ల్ నేరంగా ప‌రిగ‌ణిస్తారు. ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 25,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలున్నాయి. అంతేకాదు.. రిజిస్ట్రేషన్‌తో స్వీకరించే రసీదు ఆధారంగానే అద్దె ఇల్లు, హాస్టల్ ఇవ్వాల‌ని కూడా నిబంధ‌న‌ను చేర్చారు.

స‌హ‌జీవ‌నం చేస్తున్న జంట‌.. త‌మ వివ‌రాల‌ను త‌ల్లిదండ్రుల‌కు చెప్పాల్సి ఉంటుంది. రేపు వీరికి పిల్ల‌లు పుడితే.. ఏంట‌నేది కూడా బిల్లులో పేర్కొన్నారు. ఆ జంటకు చెందిన చట్టబద్ధమైన పిల్లలుగా గుర్తింపు పొందుతారు.

అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తులపై హక్కులు క‌లిగి ఉంటార‌ని, వారిని స‌హ‌జీవ‌నం పేరుతో వ‌దిలించుకోజాల‌ర‌ని బిల్లు స్ప‌ష్టం చేసింది. రేపు వీరు విడిపోవాలనుకుంటే, తిరిగి ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకుని సంబంధిత ప్రొసీజ‌ర్‌ను పాటించాల్సి ఉంటుంది.