Begin typing your search above and press return to search.

ప్రియుడితో హనీమూన్ కోసం తన పిల్లల్ని తానే చంపుకుంది?

కాలం మారింది. వ్యక్తిగత స్వేచ్ఛ.. సంతోషానికి మాత్రమే పెద్దపీట వేసే రోజులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తమ ఆనందానికి అడ్డు వస్తున్నారంటే.. కన్నబిడ్డల్ని సైతం కడతేర్చేందుకు వెనుకాడని కసాయిల సంఖ్య ఎక్కువ అవుతోంది.

By:  Tupaki Desk   |   21 Jun 2025 11:00 AM IST
ప్రియుడితో హనీమూన్ కోసం తన పిల్లల్ని తానే చంపుకుంది?
X

కాలం మారింది. వ్యక్తిగత స్వేచ్ఛ.. సంతోషానికి మాత్రమే పెద్దపీట వేసే రోజులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తమ ఆనందానికి అడ్డు వస్తున్నారంటే.. కన్నబిడ్డల్ని సైతం కడతేర్చేందుకు వెనుకాడని కసాయిల సంఖ్య ఎక్కువ అవుతోంది. గతంలో కన్నబిడ్డల కోసం తమ జీవితాల్ని సైతం త్యాగం చేసే పరిస్థితి నుంచి ఇప్పుడు తమ లైంగిక వాంఛల్ని తీర్చుకోవటానికి పేగు బంధాన్ని సైతం అడ్డు తొలగించుకుంటున్న తీరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరెన్ని భయానక ఉదంతాల్ని చూడాల్సి వస్తుంది భగవంతుడా? అనుకోకుండా ఉండలేని దుస్థితి.

తాజాగా ప్రియుడితో హనీమూన్ కోసం చిన్నారులైన తన కన్నబిడ్డల్ని కడతేర్చిందో తల్లి. అభంశుభం తెలియని పిల్లలు అన్న స్ప్రహ లేకుండా తన సంతోషం మాత్రమే తనకు ముఖ్యమన్నట్లుగా వ్యవహరించిన ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇద్దరు కన్నపిల్లల్ని చంపేసిన ఈ కామపిశాచిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రియుడ్ని కోసం గాలిస్తున్నారు. యూపీలోని ముజఫర్ నగర్ లోని రోడ్కలి గ్రామానికి చెందిన 24 ఏళ్ల ముస్కాన్ అనే మహిళకు గతంలో వసీం అనే వ్యక్తితో పెళ్లైంది. ప్రస్తుతం అతను చండీగఢ్ లో ఉంటున్నాడు.

భర్త దూరంగా ఉన్న వేళ.. ఆమెకు జునైద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఆమె ఐదేళ్ల కొడుకు అర్హాన్.. ఏడాది వయసున్న కుమార్తె ఎన్యాలు అనుమానాస్పద రీతిలో మరణించారు. చిన్నారుల మరణాల మీద పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు రంగంలోకి దిగారు. తమకు అందిన సమాచారం నేపథ్యంలో ముస్కాన్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

పోలీసుల దర్యాప్తులో అసలు నిజాన్ని ముస్కాన్ కక్కేసింది. తన ప్రియుడు జునైద్ తో కొత్త జీవితాన్ని షురూ చేసేందుకు ఇద్దరు పిల్లలు అడ్డుగా ఉన్నారని.. అందుకే ప్రియుడి సాయంతో వాళ్లిద్దరికి విషం ఇవ్వటంతో మరణించినట్లుగా పేర్కొంది. ఇద్దరు చిన్నారుల్ని అడ్డు తొలగించుకున్న తర్వాత హనీమూన్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్న విషయాన్ని ఆమె వెల్లడించింది. దీంతో పోలీసులు సైతం షాక్ తిన్నారు. ముస్కాన్ ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.