Begin typing your search above and press return to search.

అటు అమెరికా ప్రెసిడెంట్ ఇటు బ్రిటన్ ప్రధాని ...విడిది చేసేది అక్కడే...!

అటు అమెరికా ప్రెసిడెంట్ ఇటు బ్రిటన్ ప్రధాని ఆ వైపు ఆస్ట్రేలియా ప్రధాని మరో వైపు కెనడ దేశాధిపతి ఇలా చాలా మంది ప్రముఖ నేతలు అంతా ఢిల్లీకి వచ్చి వాలుతున్నారు.

By:  Tupaki Desk   |   7 Sep 2023 4:31 PM GMT
అటు అమెరికా ప్రెసిడెంట్ ఇటు బ్రిటన్ ప్రధాని ...విడిది చేసేది అక్కడే...!
X

ప్రపంచ అగ్ర నేతలు అంతా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ప్రపంచంలో బలమైన నాయకులు అధిపతులు అంతా చలో ఢిల్లీ అంటూ కట్టకట్టుకుని వచ్చేశారు. వారంతా వచ్చినది జీ 20 సదస్సు కోసం. 18వ జీ 20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడమే కాకుండా బ్రహ్మాండమైన ఆతీధ్యం అతిధులకు ఇస్తోంది.

అటు అమెరికా ప్రెసిడెంట్ ఇటు బ్రిటన్ ప్రధాని ఆ వైపు ఆస్ట్రేలియా ప్రధాని మరో వైపు కెనడ దేశాధిపతి ఇలా చాలా మంది ప్రముఖ నేతలు అంతా ఢిల్లీకి వచ్చి వాలుతున్నారు. జీ 20 సదస్సు ఈ నెల 9, 10 తేదీలలో ఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడిగా అందరికీ స్వాగతం పలకనున్నారు.

ఇక ఢిల్లీ 8వ తేదీ నుంచి 10వ తేదీ దాకా మూడు రోజుల పాటు పూర్తిగా భద్రతా వలయంలోకి వెళ్లిపోతోంది. వీవీఐపీలకే చోటు ఉంటుంది. ఇదిలా ఉంటే ఢిల్లీకి వచ్చా ప్రముఖులకు బస కూడా పూర్తి విలాసవంతమైన చోట ఇస్తున్నారు.

ప్రపంచ పెద్దన్న అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ నెల 8వ తేదీ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. ఆన మూడు రోజుల పాటు ఢిల్లీలో బస చేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా భారత్ తో చర్చిస్తారు. కీలక ఒప్పందాలు కూడా కుదురుతాయని అంటున్నారు. 2020 ఫిబ్రవరి 25న అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత దేశం వచ్చారు.

ఇన్నాళ్లకు అంటే మూడున్నరేళ్లకు మళ్లీ అదే అమెరికా నుంచి ప్రెసిడెంట్ వస్తున్నారు భారత్ తో మంచి సంబంధాలు పెంచుకోవడానికి అమెరికా ప్రాధాన్యత ఇస్తోంది. దాంతో కరోనా సోకి ఇపుడే బయటపడిన జో బైడెన్ జీ 20 కి కోరి మరీ వస్తున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా భారత్ కి వస్తున్నారు.

ఇలా పాశ్చత్య దేశాలన్నీ భారత్ కి రావడం నిజంగా గొప్ప సందర్భం అనే అంటున్నారు. ఇదిలా ఉంటే భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక జీ 20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ప్రపంచ నాయకులు ఢిల్లీలోని టాప్ హోటళ్లలో ప్రత్యేక వసతితో బస చేయనున్నారు.

ఈ హోటళ్ళలో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా ఆస్ట్రేలియా వంటి జీ 20 దేశాల నుండి అధిపతులు ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. భద్రత కోసం ఈ హోటళ్ల పరిసరాలలో హైసెక్యూరిటీ చర్యలు చేపట్టారు. వారి భద్రత కోసం ఢిల్లీ పోలీసులు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఈ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్, ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్, కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో సౌదీ అరేబియా నుంచి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రముఖులు హాజరవడంతో భారత ప్రతిష్ట రెట్టింపు అవుతోంది.

జీ 20 సదస్సుకు నేతృత్వం వహిస్తున్న సందర్భం కూడా భారత్ ని హైలెట్ చేస్తోంది. ఇంకో వైపు రష్యా కూడా జీ 20 సదస్సుకు పూర్తి మద్దతుగా నిలుస్తోంది. చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ రావడం లేదు కానీ ఆ దేశ ప్రధానిని పంపుతున్నారు. మొత్తానికి జీ 20 సదస్సు ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ని ఒక్కసారిగా పెంచేస్తుంది అంటున్నారు.