Begin typing your search above and press return to search.

మా ఫైట‌ర్ జెట్ మిస్.. ఎక్క‌డుందో చెప్పండి ప్లీజ్‌: అమెరికా

ఏం జ‌రిగింది? అమెరికా సైన్యానికి చెందిన ఫైట‌ర్ జెట్ ఎఫ్ -35 ఆకాశ మార్గంలో ఉండగా అత్యవసర పరిస్థితి తలెత్తి జాడ క‌నిపించ‌కుండా పోయింది.

By:  Tupaki Desk   |   19 Sep 2023 4:36 AM GMT
మా ఫైట‌ర్ జెట్ మిస్.. ఎక్క‌డుందో చెప్పండి ప్లీజ్‌: అమెరికా
X

''మా ఫైట‌ర్ జెట్ మిస్ అయింది. ఎక్క‌డుందో చెప్పండి ప్లీజ్‌''- అంటూ అమెరికా సైన్యం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వాస్త‌వానికి.. ప్ర‌జ‌ల‌కు ఏమైనా స‌మ‌స్య‌వ‌చ్చినా.. దేశానికి ఏమైనా స‌మ‌స్య వ‌చ్చినా ముందుండే సైన్యం.. ఇప్పుడు త‌న స‌మ‌స్య‌ను ప్ర‌జ‌ల ముందుకు తెచ్చి.. త‌మ‌కు సాయం చేయాల‌ని అభ్య‌ర్థించ‌డం.. ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏం జ‌రిగింది? అమెరికా సైన్యానికి చెందిన ఫైట‌ర్ జెట్ ఎఫ్ -35 ఆకాశ మార్గంలో ఉండగా అత్యవసర పరిస్థితి తలెత్తి జాడ క‌నిపించ‌కుండా పోయింది. ఆదివారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న సైనికుల‌ను బెంబేలెత్తించింది.

ఈ జెట్ విలువ రూ.వందల కోట్లలో ఉంటుంద‌ని స‌మాచారం. అది క‌నిపించ‌కుండా పోవ‌డంతో ఒక్క‌సారిగా అలెర్ట్ అయిన సైనికాధికారులు.. పోర్టు నగరమైన చార్లెస్టన్‌లో ఫెడరల్ ఏవియేషన్ రెగ్యులేటర్‌తో కలిసి వెతికే ప‌నిని ప్రారంభించారు.

కూలిపోయిందా? ఆకాశ మార్గంలో ఉన్న‌ప్పుడు సమ‌స్య త‌లెత్తిన నేప‌థ్యంలో ఎఫ్‌-35 కూలిపోయిందా? అనే కోణంలో కూడా అధికారులు గాలిస్తున్నారు. చార్లెస్ట‌న్ నగ‌రంలో రెండు స‌ర‌స్సులు ఉన్నాయి. వీటిలో ఏమైనా అది కుప్ప‌కూలి పోయి ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో స‌ద‌రు స‌ర‌స్సులో అధికారులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ విషయంలో స్థానికులు సహకరించాలని కోరారు. అయితే, సైనికుల అభ్య‌ర్థ‌న‌పై స్థానికులు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇలాంటి సంద‌ర్భాల్లో జెట్‌ను గుర్తించేందుకు ఉప‌యోగించే ట్రాకింగ్ వ్య‌వ‌స్థ ఏమైంద‌ని ప్రశ్నించారు.