Begin typing your search above and press return to search.

ఏలియ‌న్స్‌.. గురించి ఆలా చెప్పి అమెరికా షాక్ ఇచ్చింది!

మ‌రోవైపు.. ఏలియ‌న్స్ ఉన్నాయ‌ని కొంద‌రు.. లేవ‌ని కొంద‌రు వాదిస్తున్న విష‌యం కూడా తెలిసిందే. దీనిపై అనేక ప‌రిశోధ‌న‌లు కూడా జ‌రిగాయి. జ‌రుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   9 March 2024 4:01 AM GMT
ఏలియ‌న్స్‌.. గురించి ఆలా చెప్పి అమెరికా షాక్ ఇచ్చింది!
X

ఏలియ‌న్స్‌.. గ్ర‌హాంతర వాసులుగా త‌ర‌చుగా చ‌ర్చ‌ల్లోకి వార్త‌ల్లోకి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. దీనికి ఏలియ‌న్స్‌తో లింకు పెట్టి మాట్లాడ‌డం ప‌రిపాటిగా మారింది. ముఖ్యంగా అమెరికాలో దీనికి సంబంధించిన చ‌ర్చ ఎక్కువ‌గా సాగుతోంది. మ‌రోవైపు.. ఏలియ‌న్స్ ఉన్నాయ‌ని కొంద‌రు.. లేవ‌ని కొంద‌రు వాదిస్తున్న విష‌యం కూడా తెలిసిందే. దీనిపై అనేక ప‌రిశోధ‌న‌లు కూడా జ‌రిగాయి. జ‌రుగుతున్నాయి.

ఈ క్ర‌మంలో జాగా అమెరికాకు చెందిన ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న విభాగం(డిఫెన్స్‌) సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట పెట్టింది. దీనిపై తాము అన్ని కోణాల్లోనూ ప‌రిశోధ‌న‌లు చేసిన‌ట్టు తెలిపింది. అయితే.. ఎక్క‌డా ఏలియ‌న్స్ ను నిర్ధారించే ప‌రిస్థితి క‌నిపించ‌లేదని.. ఎవ‌రో కొంద‌రు దీనిని సృష్టించార‌ని పేర్కొంది. ఈ విస్తృత ప‌రిశోధ‌న‌లో తాము ర‌ష్యా, జ‌పాన్‌, జ‌ర్మ‌నీ ల సాయం తీసుకున్న‌ట్టు తెలిపింది. అంతేకాదు.. ప్ర‌స్తుత ప‌రిశోధ‌కుల‌ను కూడా క‌లుపుకొని వెళ్లామ‌ని పేర్కొంది.

ఏలియన్స్‌ ఉనికిని నిర్ధారించే ఆధారాలేవీ లభించలేదని అమెరికా డిఫెన్స్ విభాగాధిప‌తి తేల్చి చెప్పారు. యూఎఫ్‌వో(గుర్తించ‌ని ఎగిరే ప‌ళ్లాలు)లు కనిపించాయంటూ 1945 నుంచి వినిపిస్తున్న‌ వార్తలపై సుదీర్థ కాలం పరిశోధన చేశామ‌ని తెలిపారు. అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు తాజాగా డిఫెన్స్ విభాగం విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

అమెరికా ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించాయ‌ని తెలిపింది. అధ్యయన నివేదికలోని మరిన్ని వివరాలను త్వరలో ప్ర‌పంచానికి చెబుతామ‌ని పేర్కొంది. ఇక‌పైనైనా ఏలియన్స్ గురించి త‌ప్పుడు ప్ర‌చారాలు మానుకోవాల‌ని సూచించింది. దీనివ‌ల్ల‌.. ప్ర‌పంచంలో ఏదో జ‌రుగుతోంద‌న్న చ‌ర్చ త‌లెత్తుతోంద‌ని అభిప్రాయ‌ప‌డింది.