Begin typing your search above and press return to search.

అమెరికా ప్రెసిడెంట్‌ ఎన్నికల పోల్‌.. ముందుంది వీరే!

ఈ వారం విడుదలైన హార్వర్డ్‌ క్యాప్స్‌-హారిస్‌ పోల్‌ లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ కంటే డొనాల్డ్‌ ట్రంప్, హేలీ, టిమ్‌ స్కాట్‌ లు ముందంజలో ఉన్నారు

By:  Tupaki Desk   |   20 Sep 2023 3:30 PM GMT
అమెరికా ప్రెసిడెంట్‌ ఎన్నికల పోల్‌.. ముందుంది వీరే!
X

అమెరికా అధ్యక్ష పదవికి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన ముఖాముఖి పోల్‌ లో ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ కంటే మరో భారత-అమెరికన్‌ అభ్యర్థి నిక్కీ హేలీ ఆధిక్యంలో ఉన్నారు.

ఈ వారం విడుదలైన హార్వర్డ్‌ క్యాప్స్‌-హారిస్‌ పోల్‌ లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ కంటే డొనాల్డ్‌ ట్రంప్, హేలీ, టిమ్‌ స్కాట్‌ లు ముందంజలో ఉన్నారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో పోటీలో ఉన్న భారతీయ-అమెరికన్‌ వ్యవస్థాపకుడు వివేక్‌ రామస్వామి.. ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిసాంటిస్‌ కంటే ముందున్నారు.

2024లో హేలీ, బిడెన్‌ మధ్య జరిగిన ముఖాముఖి సర్వేలో ప్రస్తుత అధ్యక్షుడికి మద్దతు ఇస్తామని 37 శాతం మంది చెప్పారు, కాగా 41 శాతం మంది నిక్కీ హేలీకి మద్దతు ప్రకటించారు. మరో 21 శాతం తాము నిర్ధారించుకోలేదని తెలిపారు.

అధ్యక్షుడు జో బిడెన్‌ జాతీయ పోల్‌ సర్వేల కంటే వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు బహుళ అభ్యర్థులు ఆయన కంటే ముందున్నారు. హేలీ వంటి వ్యక్తులు బరిలోకి దిగడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల పరిస్థితులు మారిపోయాయని హార్వర్డ్‌ హారిస్‌ పోల్‌ సహ-డైరెక్టర్‌ మార్క్‌ పెన్‌ ది హిల్‌తో అన్నారు.

ది హిల్‌తో పంచుకున్న పోల్‌లో 44 శాతం మంది ట్రంప్‌కు ఓటు వేస్తామని చెప్పారు. మరో 40 శాతం మంది బిడెన్‌కు మద్దతు ఇస్తామని చెప్పారు.

జులైలో జరిగిన హార్వర్డ్‌ క్యాప్స్‌–హారిస్‌ పోల్‌ లో ట్రంప్‌ కు 45 శాతం, బిడెన్‌కు 40 శాతం ఓట్లు దక్కాయి. మరో 15 శాతం మంది తాము ఎవరినీ ఎంపిక చేసుకోలేదని వెల్లడించారు.

బిడెన్, స్కాట్‌ల మధ్య సెప్టెంబరు 12-14 వరకు ముఖాముఖి పోల్‌ నిర్వహించినప్పుడు 2,103 మంది ఓట్లేశారు. మొదటి పోల్‌ లో బిడెన్‌ 37 శాతం మంది మద్దతు పొందగా, రెండో దానిలో 39 శాతం మంది మద్దతు పొందారు.

కాగా అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న ఇతర భారతీయ-అమెరికన్‌ వివేక్‌ రామస్వామి కంటే బిడెన్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచారు. ఆయనకు 37 శాతం మంది మద్దతు ప్రకటించారు. ఇక బిడెన్‌ కు 39 మంది మద్దతు లభించింది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ ఇటీవల మాట్లాడుతూ చాలా మంది తన వయస్సుపై దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు. డోనాల్డ్‌ ట్రంప్, అతడి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులు అమెరికన్‌ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నారని ధ్వజమెత్తారు.

కాగా డెమోక్రటిక్‌ అభ్యర్థి, వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హరీస్‌ పై పోల్‌ కూడా హోరాహోరీగా సాగింది. హారిస్‌ కు 40 శాతం రాగా, ట్రంప్‌ కు 46 శాతం ఓట్లు రావడం గమనార్హం. దీంతో కమల హారిస్‌ ను ఓడించే ఏకైక అభ్యర్థి ట్రంప్‌ అని తేలింది.