అమెరికా నుంచి వెళ్లిపోకుంటే రోజుకు రూ.86వేలు ఫైన్
తాము ఇచ్చిన ఆదేశాల్ని పాటించని వారికి రోజుకు రూ.86వేలు (అమెరికా డాలర్లలో చెప్పాలంటే 998) జరిమానా కట్టాలని స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 9 April 2025 10:34 AM ISTఅమెరికా అధ్యక్ష కుర్చీ నుంచి బైడెన్ దిగేసి.. ట్రంప్ ఎక్కేసిన తర్వాత మొదలైన పర్వాల్లో అక్రమ వలసల పేరుతో పలువురికి చుక్కలు చూపిస్తున్నారు అమెరికన్ అధికారులు. ఇప్పటికే పలువురిని గుర్తించి.. వారిని బంధీలుగా చేసి వారి దేశాలకు పంపిన వైనం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులకు మాస్ వార్నింగ్ జారీ చేశారు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు.
తాము ఇచ్చిన ఆదేశాల్ని పాటించని వారికి రోజుకు రూ.86వేలు (అమెరికా డాలర్లలో చెప్పాలంటే 998) జరిమానా కట్టాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఫైన్ కట్టకుంటే వారి ఆస్తుల్ని జఫ్తు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. తాము వెళ్లిపొమ్మని చెప్పటానికి ముందే.. స్వీయ బహిష్కరణ సేఫ్ అని చెబుతున్న అధికారులు.. ఒకవేళ కాదనుకుంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ దేశం వీడిపోవాలన్న తుది ఆదేశాలు అందుకున్న వారు.. ఇంకా అమెరికాలోనే ఉంటే భారీ ఫైన్ తప్పదని స్పష్టం చేస్తున్నారు.
తాజాగా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం మార్చి 31న సోషల్ మీడియాలో కీలక ఆదేశాల్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీని సారాంశం ఏమంటే.. తమ తనిఖీల్లో పట్టుబడిన వారికి ఎలాంటి క్రమబద్ధీకరణ ఉందని.. అప్పటివరకు సంపాదించుకున్న డబ్బును సైతం నష్టపోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బహిష్కరణ ఆదేశాలు అందుకున్న తర్వాత వెళ్లిపోని వారు రోజుకు 998 అమెరికన్ డాలర్లు జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒకవేళ సెల్ఫ్ డిపోర్ట్ యాప్ లో నమోదు చేసుకున్న తర్వాత దేశాన్ని వదిలిపెట్టి వెళ్లకుండా ఉంటే వెయ్యి నుంచి ఐదు వేల డాలర్ల మేర జరిమానా ఉంటుందని వెల్లడించింది.
ఇలాంటి వారు తిరిగి ఫ్యూచర్ లో ఎప్పుడూ అమెరికాకు తిరిగి వచ్చే అవకాశాన్ని కోల్పోతారని.. జైలుశిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నిజానికి ఈ జరిమానాల చట్టం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 1996లోనే తీసుకొచ్చారు. అప్పట్లో తొమ్మిది మంది అక్రమ వలసదారులకు భారీగా ఫైన్ విధించినా.. ఆ తర్వాత కొందరిపైన ఉపసంహరించుకునారు. ట్రంప్ తర్వాత పవర్ చేపట్టిన బైడెన్ ఈ ఫైన్ విధించే పద్దతికి మంగళం పాడేశారు. తాజాగా ట్రంప్ సర్కారు ఈ జరిమానాల ప్రోగ్రాంను భారీగా చేపట్టింది. ఇక్కడే ఇంకో ఆలోచ రావొచ్చు. ఈ నిర్ణయాలపై కోర్టును సంప్రదించాలని భావిస్తే తప్పు చేసినట్లేనని చెబుతున్నారు. ఎందుకుంటే.. ఇలాంటి అంశాలపై కోర్టులో సవాలు చేసే వీలున్నా.. సానుకూల ఫలితాన్ని ఆశించటం అత్యాశే అవుతుందని చెబుతున్నారు. అయితే.. ఈ చట్టాన్ని ప్రయోగించాలన్నది తమ ఉద్దేశం కాదని.. అక్రమ వలసల్ని భయపెట్టటమే తమ ఉద్దేశంగా చెబుతున్నా.. వాస్తవం అందుకు భిన్నంగా ఉందన్న మాట వినిపిస్తోంది.
