Begin typing your search above and press return to search.

అమెరికా వీసా పొందడం హైదరాబాద్ లోనే బెటర్ ఎందుకంటే..?

ఈ క్రమంలో 2025 ఏప్రిల్ 25 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన వీసా అపాయింట్ మెంట్ నిరీక్షణ సమయం అంచనాలను యూఎస్ డిపార్ట్ మెంట్ ప్రచురించింది

By:  Tupaki Desk   |   2 May 2025 7:00 PM IST
అమెరికా వీసా పొందడం హైదరాబాద్  లోనే బెటర్ ఎందుకంటే..?
X

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం అగ్రరాజ్యం వీసా దక్కించుకోవడం, దక్కించుకున్న వీసాను నిలదొక్కుకోవడం గతంలో అంత సులువుకాదనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2025 ఏప్రిల్ 25 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన వీసా అపాయింట్ మెంట్ నిరీక్షణ సమయం అంచనాలను యూఎస్ డిపార్ట్ మెంట్ ప్రచురించింది.

అవును... అక్రమ వలసదారులు, బహిష్కరణ, వీసా ఆమోదాలపై జరుగుతున్న గందరగోళం మధ్య యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తన వీసా అపాయింట్మెంట్ నిరీక్షణ సమయ అంచనాలను ఈ ఏడాది ఏప్రిల్ లో అప్ డేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్స్ ప్రకారం.. భారత్ లోని వివిధ నగరాల్లో సగటు ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాలు, తదుపరి అందుబాటులో ఉన్న ఇంటర్యూ అపాయింట్మెంట్ ల వివరాలు వెల్లడించింది.

ఇందులో భాగంగా... న్యూఢిల్లీ, చెన్నై, కోల్ కతా, ముంబై నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలోని వీసా కేంద్రంలో యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం త్వరగా అవుతుంది. ఇందులో భాగంగా... హైదరాబాద్ లో అత్యల్పంగా 7.5 నెలల సమయం వేచి ఉండాల్సి రాగా.. చెన్నైలో అత్యధికంగా 11.5 నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. అదే విధంగా తదుపరి ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కూడా హైదరాబాద్ లోనే తక్కువ సమయంలో అందుబాటులో ఉంది.

హైదరాబాద్ మరియు ముంబై కేంద్రాలలో అత్యల్పంగా 7.5 నెలలు వేచి ఉండాల్సి వచ్చింది, చెన్నైలో అత్యధికంగా 11.5 నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. అదేవిధంగా, దేశంలోని ఐదు కేంద్రాలలో హైదరాబాద్ కేంద్రంలోనే తదుపరి ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కూడా సాధ్యమైనంత తక్కువ సమయంలో 7.5 నెలలు అందుబాటులో ఉంది. ఇదే సమయంలో బీ1 (వ్యాపారం), బీ2 (పర్యాటకం), ఎఫ్1 (విద్యార్థి) వీసా కోసం వేచి ఉండే సమయాలు వెలువడ్డాయి.

దేశంలో సగటు ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాలు!:

హైదరాబాద్ - 7.5 నెలలు

ముంబై - 7.5 నెలలు

కోల్ కతా - 8 నెలలు

న్యూఢిల్లీ - 9 నెలలు

చెన్నై - 11.5 నెలలు

తదుపరి అందుబాటులో ఉన్న ఇంటర్వ్యూ అపాయింట్మెంట్!:

హైదరాబాద్ - 7.5 నెలలు

కోల్ కతా - 8 నెలలు

న్యూఢిల్లీ - 9 నెలలు

ముంబై - 9.5 నెలలు

చెన్నై - 13.5 నెలలు

విద్యార్థి, పని వీసా నిరీక్షణ సమయాలు!:

ఎఫ్, ఎం, జే వీసా వర్గాల తదుపరి అపాయింట్మెంట్ వివరాలు అత్యల్పంగా చెన్నైలో 1.5 నెలలు.. హైదరాబాద్, కోల్ కతా, న్యూఢిల్లీలో 2 నెలలు, ముంబైలో 3 నెలలుగా ఉంది.